Home /News /andhra-pradesh /

FATHERS DAY 2020 SPECIAL STORY ON CHANDRABABU AND LOKESH SK

Father's Day 2020 | చంద్రబాబు F/o లోకేష్.. తనయుడికి అన్నీ తానై..

నారా లోకేష్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)

నారా లోకేష్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)

ప్రాణ స్నేహితుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జ‌గ‌న్ ఒక వైపు రాజ‌కీయ‌ల్లో అంద‌లాలు ఎక్కుతుంటే ఆ స్థాయికి త‌న కొడుకును తీసుకెళ్ల‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారు చంద్ర‌బాబు.

  ముప్పై ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ చరిత్ర. మూడు సార్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన అనుభవం. రాష్ట్రంలోనే కాదు దేశ‌వ్యాప్తంగా ఒక మంచి ముఖ్య‌మంత్రిగా పేరుతెచ్చుకున్న వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడు. త‌న‌లానే త‌న కుమారడికి కూడా ఒక మంచి నేత‌గా ఎద‌గాల‌ని గ‌త ఐదేళ్లుగా రాజ‌కీయ పాఠాలు చెబుతూ అడుడ‌గునా నారాలోకేష్ చేయిప‌ట్టి న‌డిపిస్తున్నారు చంద్రబాబు. ఉన్న‌త చ‌ద‌వులు కోసం విదేశాలు పంపించిన స‌మ‌యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు.. త‌న‌కు స‌మ‌యం ఉంటే కుటుంబానికే కేటాయిస్తారు. సమయం కేటాయించ‌డ‌మే కాకుండా ఏ హోదాలో ఎంత బిజీగా ఉన్నా ఏడాది ఫ్యామీలి విహార యాత్ర చేస్తారు చంద్ర‌బాబు. రాజ‌కీయ శ‌త్రువు, త‌న ప్రాణ స్నేహితుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జ‌గ‌న్ ఒక వైపు రాజ‌కీయ‌ల్లో అంద‌లాలు ఎక్కుతుంటే ఆ స్థాయికి త‌న కొడుకును తీసుకెళ్ల‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారు చంద్ర‌బాబు.

  చంద్రబాబు, నారా లోకేష్


  రాజ‌కీయంలో లోకేష్ చేయి ప‌ట్టి న‌డిపిస్తున్న బాబు
  2019 ఎన్నిక‌ల త‌రువాత పార్టీకి లోకేష్ ఫేస్‌ను ముందంజ‌లో పెట్ట‌డంతో చంద్ర‌బాబు ఒక విధంగా స‌క్సెస్ అయ్య‌ర‌నే చెప్పుకోవాలి. తొలినాళ్ల నుంచే లోకేష్ చ‌దువుకే ఎక్కువ ప్రాదాన్య‌త ఇచ్చారు చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర రాజ‌కీయాల‌కు ఏమాత్రం సంబంధం లేకుండా కొన్ని రోజుల పాటు అమెరికాలోనే ఉంచి చ‌దివించారు. ఆ స‌మ‌యంలో కూడా చంద్ర‌బాబు నిత్యం లోకేష్ వ్య‌హారాలు చూసుకునేవారు. ఎక్క‌డ తాను ఒంట‌రిగా ఉన్నాను అనే భావ‌న లేకుండా పెంచారు. నారా లోకేష్ స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ ప‌ట్టా, కార్నేగీ మెల‌న్ విశ్వ‌విద్యాల‌యం నుంచి మేనేజ్‌మెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్ లో స్పెష‌లైజేష‌న్‌తో బ్యాచిల‌ర్ ఆఫ్ సైన్స్ ప‌ట్టా పొందిన త‌రువాత రాష్ట్రానికి వ‌చ్చారు. 1992 లో తాను స్థాపించిన హెరిటీజ్ సంస్థ బాధ్య‌త‌ల‌ను లోకేష్‌కు అప్పగించారు చంద్రబాబు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు లోకేష్ హెరిటేజ్ సంస్థ‌ను అంచ‌లంచ‌ల‌గా ఎదిగేలా చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా లోకేష్‌కు పార్టీతో పాటు ప్ర‌భుత్వంలో బాధ్యతలను కూడా అప్ప‌గించారు. రాజ‌కియాల్లోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్యంగా త‌ను వాడే తెలుగుపై ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి సోష‌ల్ మీడియాలో చాలా విమ‌ర్శ‌లు వచ్చాయి. ఐతే ఎక్క‌డ త‌న కొడుకు మ‌నోధైర్యం దెబ్బ‌తిన‌కుండా పోరాడే ధైర్య‌ాన్ని నింప‌డంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు క్రమేపి పార్టీపై ప‌ట్టుతో పాటు ప్ర‌భుత్వంలో కూడా ప‌ట్టు సాధించారు లోకేష్.

  చంద్రబాబు, నారా లోకేష్


  ప్ర‌తి ఏడాది ఒక ట్రిప్ ఉండాల్సిందే..

  ముఖ్య‌మంత్రిగా ఎంత బిజీగా ఉన్న కుటుంబానికి స‌మ‌యాన్ని కేటాయించ‌డానికి ప్రాధాన్య‌త ఇచ్చేవారు చంద్ర‌బాబు. ప్ర‌తీ ఏడాది మే లో న్యూజిలాండ్ కాని ఇత‌ర దేశాలకు కాని ఫ్యామిలితో వెళ్లాల్సిందే. దీంతోపాటు ప్ర‌తి సంక్రాంతికి కుప్పంలో త‌న స్వ‌గృహంలో కుటుంబం స‌భ్య‌ల‌తో క‌లిసి పండుగ‌ను జ‌రుపుకుంటారు చంద్ర‌బాబు.
  First published:

  Tags: Chandrababu naidu, Fathers Day, Fathers Day 2020, Happy Fathers Day, Nara Lokesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు