FATHER CARRIED SON DEAD BODY ON BIKE AS NO AMBULANCE AT GOVERNMENT HOSPITAL IN NELLORE DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Very Sad: ఏపీలో మరోచోట రుయా తరహా ఘటన.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు దేవుడా..
నెల్లూరు జిల్లాలో కొడుకు డెడ్ బాడీని బైక్ పై మోసుకెళ్లిన తండ్రి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) రుయా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటన మరోసారి రిపీట్ అయింది. ఈసారి అదే అమానుషం నెల్లూరు జిల్లా (Nellore District) సంగంలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) రుయా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటన మరోసారి రిపీట్ అయింది. ఈసారి అదే అమానుషం నెల్లూరు జిల్లా (Nellore District) సంగంలో జరిగింది. సంగంలో బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవ శాత్తూ బహిర్భూమికి వెళ్లి కనిగిరి జలాశయంలో పడిపోయారు. వారిలో శ్రీరామ్ అనే బాలుడ్ని బంధువులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. 108 వాహనం ద్వారా మృతదేహాన్ని తమ నివాసానికి చేర్చాలని కోరగా నిబంధనలు అంగీకరించవని సిబ్బంది నిరాకరించారు.అక్కడ మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేకపోవడంతో ఆటోలు, ప్రైవేట్ వాహనాలు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో చేసేది లేక బాలుడి తండ్రి బైక్ పై మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు.
తిరుపతి రుయాలో జరిగిన ఘటన మరువక ముందే మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఐతే సాధారణంగా పీ.హెచ్.సీల్లో మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో మాత్రమే ఈ వాహనాలుండే అవకాశాలున్నాయి. తాజాగా ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.
ఇటీవల తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్నమయ్య జిల్లా (Annamayya District) చిట్వేలు గ్రామానికి చెందిన జెసవా అనే బాలుడు అనారోగ్యంతో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు రుయా వద్ద ఉన్న అంబులెన్స్ లను ఆశ్రయించారు.
తిరుపతి నుంచి చిట్వేలు గ్రామానికి తీసుకెళ్లేందుకు రూ.30 వేలు ఇవ్వాలని స్థానిక అబులెన్స్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. చివరకు రూ.20 వేలుకు వస్తామని బేరాలు ఆడారు. అంత ఇచ్చుకోలేని ఆ తల్లితండ్రులు గ్రామానికి చెందిన శ్రీకాంత్ యాదవ్ ను సంప్రదించారు. దీంతో శ్రీకాంత్ యాదవ్ ఉచిత అంబులెన్స్ ను పంపించారు. రుయా వద్దకు చేరుకున్న ఆ ఉచిత అంబులెన్స్ ను అక్కడ అంబులెన్స్ యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. లోపలకి వెళ్లి శవాన్ని అంబులెన్స్ లో ఎక్కించుకుంటే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఎవరైనా సరే మా అంబులెన్స్ లోనే వెళ్లాలి అని వచ్చిన అంబులెన్స్ ను వెనక్కి పంపారు. దీంతో చేసేది లేక బైక్ పైనే బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై సీఎం కూడా సీరియస్ అవడంతో అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్ మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.