Home /News /andhra-pradesh /

FATHER CARRIED BOY DEAD BODY FOR 90 KM ON BIKE AFTER AMBULANCE MAFIA DEMANDS HUGE MONEY IN TURUMATI RUIA HOSPITAL FULL DETAILS HERE PRN TPT

Tirupati News: దేవుడా..! పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు.. ప్రాణం పోయినా కనికరించరా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tirupati: ఈ రోజుల్లో మానవత్వానికంటే డబ్బుకే విలువ ఎక్కువ. ప్రాణాలు పోతున్నా పైసలే ప్రాధాన్యం. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డబ్బు లేనిదే విలువ లేదు. పసివాడి ప్రాణాలు పోయాయన్న కనికరం లేకుండా కాసుల కోసం పీక్కుతిన్న మాఫియాను ఏం చేసినా తప్పులేదు.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    ఈ రోజుల్లో మానవత్వానికంటే డబ్బుకే విలువ ఎక్కువ. ప్రాణాలు పోతున్నా పైసలే ప్రాధాన్యం. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డబ్బు లేనిదే విలువ లేదు. వాడికి పట్టుమని పదేళ్లు కూడా లేవు. అంతలోనే మృత్యువుకు బలయ్యాడు. కన్నకొడుకు చనిపోయాడని బాధలే ఉన్న తల్లిదండ్రులను రాబందుల్లా కాసుల కోసం పీక్కుతిన్నారు. చేసేది లేక బిడ్డ శవాన్ని ఒళ్లో పెట్టుకొని బైకుపై 90 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి ఆ తండ్రికి పట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అన్నమయ్య జిల్లా (Annamayya District) చిట్వేలు గ్రామానికి చెందిన జెసవా అనే బాలుడు అనారోగ్యంతో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు రుయా వద్ద ఉన్న అంబులెన్స్ లను ఆశ్రయించారు.

    తిరుపతి (Tirupati) నుంచి చిట్వేలు గ్రామానికి తీసుకెళ్లేందుకు రూ.30 వేలు ఇవ్వాలని స్థానిక అబులెన్స్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. చివరకు రూ.20 వేలుకు వస్తామని బేరాలు ఆడారు. అంత ఇచ్చుకోలేని ఆ తల్లితండ్రులు గ్రామానికి చెందిన శ్రీకాంత్ యాదవ్ ను సంప్రదించారు. దీంతో శ్రీకాంత్ యాదవ్ ఉచిత అంబులెన్స్ ను పంపించారు. రుయా వద్దకు చేరుకున్న ఆ ఉచిత అంబులెన్స్ ను అక్కడ అంబులెన్స్ యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. లోపలకి వెళ్లి శవాన్ని అంబులెన్స్ లో ఎక్కించుకుంటే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఎవరైనా సరే మా అంబులెన్స్ లోనే వెళ్లాలి అని వచ్చిన అంబులెన్స్ ను వెనక్కి పంపారు.

    ఇది చదవండి: వీడు మనిషికాదు మృగం.. ఆ ఆలోచన వచ్చినందుకే ఉరితీయాలి..


    అనంతరం చనిపోయిన చిన్నారి తల్లితండ్రులతో గొడవకు దిగి... మీరు వెళ్తే అడిగినంత డబ్బులిచ్చి మా అంబులెన్స్ లోనే వెళ్లాలంటూ గొడవకు దిగారు. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లితండ్రులు ఏంచేయాలో తెలియని స్థితిలో బిడ్డ మృతదేహాన్ని తమ సమీప బంధువు సహాయంతో మోటార్ బైక్ పై రుయా నుంచి చిట్వేలు గ్రామానికి దాదాపు 90 కిలమీటర్లు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న ఓ యువకుడు ఈ ఘటనను సెల్ ఫోన్ లో చిత్రికరించడంతో విషయం బయటకు వచ్చింది.

    ఇది చదవండి: మునిగిపోయిందనుకొని నీళ్లలో గాలిస్తుంటే.. కూల్ గా బస్సుదిగింది.. గ్రామస్తుల ముఖచిత్రాలు ఇలా..!


    రుయాలో జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో సీఎం జగన్ అసమర్ధపాలన కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని.., ఇప్పటికైనా సీఎం గారు నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలి ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.


    అంబులెన్స్ ఆగడాలు ఆర్డీఓ దృష్టికి
    సమాచారం అందుకున్న తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతితో సమావేశం అయ్యారు. ఘటనపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు