Home /News /andhra-pradesh /

FARMERS POUR PETROL ON ACHAMPET VRO FOR NOT UPDATING THEIR LAND DETAILS TO ONLINE BA GNT

గుంటూరు జిల్లాలో వీఆర్వోపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వీఆర్ఓ కోటా మోహన్ రావు పంచాయతీలో ఆఫీసులో కూర్చుని రికార్డులు రాస్తుండగా రావేళ్ల లవణ్ కుమార్, పరుచూరి రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఆర్జీలు ఇవ్వమని వాగ్వాదానికి దిగారు.

    గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ రెవెన్యూ అధికారిపై పెట్రోల్ పోసిన సంఘటన అచ్చంపేట మండలం గంధశిరి గ్రామంలో చోటుచేసుకుంది. వీఆర్ఓ కోటా మోహన్ రావు పంచాయతీలో ఆఫీసులో కూర్చుని రికార్డులు రాస్తుండగా రావేళ్ల లవణ్ కుమార్, పరుచూరి రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఆర్జీలు ఇవ్వమని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అంతలోనే లవణ్ కుమార్, రామకృష్ణ దాడికి తెగబడ్డారు. తనపై పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసే ప్రయత్నం చేశాడని, ఇంతలో తన తోటి ఉద్యోగి నాగేశ్వర్ రావు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పిందని మోహన్ రావు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా, తమ భూమిని ఆన్ లైన్ లో ఎక్కించడానికి తమ దగ్గర వీఆర్ఓ లంచం తీసుకొని పనులు చేయడం లేదని తాము పెట్రోల్ పోసుకొని నిరసన తెలుపుతుండగా వాళ్లు అడ్డుకోబోతుండగా వారిపై పెట్రోల్ పడిందని రామకృష్ణ, లవణ్ కుమార్ అచ్చంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఆనంద్ తెలిపారు.

    ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ఆరేడు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరిగాయి. ఎమ్మార్వో ఆఫీసుల్లో అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో కూడా పలుచోట్ల తహసీల్దార్ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో లెక్కల్లో లేని నగదును స్వాధీనం చేసుకున్నారు.

    తన ప్రమాణస్వీకారం రోజునే రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తానని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అవినీతి నిరోధం కోసం ఓ కాల్ సెంటర్ తీసుకొచ్చారు. 14400 నెంబర్‌కు ఫోన్ చేసి ప్రభుత్వంలో అవినీతి మీద ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఇటీవల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన దిశ చట్టం తరహాలోనే అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని యోచిస్తోంది. అవినీతి నిరోధక శాఖతో జరిపిన సమీక్షలో కొన్నిరోజుల క్రితం సీఎం జగన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 1902 నెంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలూ ఏసీబీకి చెందిన 14400కు బదలాయింపు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం చేయనున్నారు. ఎమ్మార్వో, ఎండీఓ, సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Guntur

    తదుపరి వార్తలు