హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Farmer Teaches: ఎరువులు వాడితే క్లాస్ పీకే మాస్టారు! రైతు వద్దకు విద్యార్థులు క్యూ!

Farmer Teaches: ఎరువులు వాడితే క్లాస్ పీకే మాస్టారు! రైతు వద్దకు విద్యార్థులు క్యూ!

ఖండాపు ప్రసాదరావు

ఖండాపు ప్రసాదరావు

కాని వీరఘట్టాంకు చెందిన ఓ రైతు మాత్రం తాను పండిస్తున్న కూరగాయాలలలోగాని, వరిలోగాని, ఇతరత్రా పంటలను పండించడం అలవాటు చేసుకున్నాడు. దాదాపు పదేళ్ల నుంచీ ఇదే పద్ధతిలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నాడు. అదీ సేంద్రీయ వ్యవసాయం మీదే. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

ఆ రైతు ఎరువులు వాడడు. ఇంకొళ్లని వాడనివ్వడు. వినకపోతే.. క్లాస్ పీకుతుంటారు. తన పొలంలో ఎరువులు వాడకం చేయడు.. అలాగే పిల్లలకు కూడా వ్యవసాయం అవసరమని చెప్పే రైతు.. టీచర్‌గా అవతారమెత్తి క్లాసులు ఇస్తుంటారు. పూర్తి గ్రామీణ ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో ఈ రైతు మాస్టార్‌ నివసిస్తున్నారు. ప్రతీ తల్లిదండ్రి తమ పిల్లలకు ప్రాధమిక విద్యతోపాటు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలని ఆ రైతు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. అలాంటి జిల్లాలో ఎరువుల వాడకం ఎక్కువ. కాని వీరఘట్టాంకు చెందిన ఓ రైతు మాత్రం తాను పండిస్తున్న కూరగాయాలలలోగాని, వరిలోగాని, ఇతరత్రా పంటలను పండించడం అలవాటు చేసుకున్నాడు. దాదాపు పదేళ్ల నుంచీ ఇదే పద్ధతిలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నాడు. అదీ సేంద్రీయ వ్యవసాయం మీదే.

ఆర్గానిక్ వ్యవసాయంపై క్లాసులు:

వీరఘట్టం ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు ఆయన సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి... ఎలా చేయాలి...వ్యవసాయం వల్ల కలుగు లాభాలేమిటి అన్న అంశాలను దశల వారీగా వివరిస్తుంటారు. సేంద్రియ వ్యవసాయ రైతు ఖండాపు ప్రసాదరావు ఇప్పుడు రైతు మాస్టారుగా మారిపోతున్నారట. తల్లిదండ్రులకు కూడా సేంద్రియ పద్ధతే మంచిదని.. పిల్లలకు అదే నేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాలలో సేంద్రియ వ్యవసాయంపై చిన్నప్పటినుండే మక్కువ ఉండేలా ఓ సబ్జక్టును పిల్లలకు నేర్పాలన్నది ఆయన అభిలాష. తన వ్యవసాయ క్షేత్రంలో చిన్నారులకు సేంద్రియ ఎరువులు ఎలా వాడాలి.. వ్యవసాయం ఎలా చేయాలంటూ వారికి శిక్షణ ఇస్తున్నారు.

ముందుగా ఆయన ఒక మొక్కకు చుట్టూరా ఒక అట్టలాంటి దానిని పెట్టడం.. దాని వల్ల కలిగే లాభాలు వివరించడం నుంచీ మొదలుపెడతారు. దాని కలిగే లాభాలు వివరిస్తూ.. నీటిని వృధా కాకుండా ఎలా చేయాలన్నది నేర్పిస్తారు. చిన్న చిన్న బాటిల్స్‌లో నీటిని నింపి దానికి రంధ్రం చిన్నదారగా మొక్క మొదళ్లలో పడేలా వివరణ కూడా చూపారు. అలాగే సేంద్రియ ఎరువులైన ఆవుపేడ ఇతరత్రా గెత్తంను కలుపడం తెలిపారు. మామూలు గెత్తం అయిన కట్టెల పొయ్యి బుగ్గి, ఆవుపేడ, వరి గడ్డితో తయారు చేసిన ఎరువులను తయారీ విధానం ఎలాగో విద్యార్ధులకు వివరిస్తారు.

ఆరోగ్యం కోసం:

చిన్నప్పటి నుంచే వీరికి సేంద్రియ వ్యవసాయం పై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో రసాయనిక ఎరువుల పారద్రోలవచ్చంటున్నారు ఈ రైతు మాస్టారు. సేంద్రియ ఎరువులతో పండించే కూరగాయాల వల్ల కలిగే దుష్ప్రభావాలు.. నిత్యం ఇంట్లో వాడుకొనే ఆహార పదార్ధాలు తెలుసుకోవాలని వాటిపై అవగాహన కల్పిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు రైతు మాస్టారు నుంచీ విఫులంగా ప్రకృతి వ్యవసాయంపై వివరాలు తెలుసుకుంటున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. సేంద్రీయ పద్దతిలో పండే కూరగాయలు తినడం వల్ల మనం రోగాల భారీన పడకుండా ఉంటామని, ఇప్పటినుండే పిల్లలో ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తాము ఈ ఫీల్డ్ మీదకు తీసుకొని వస్తున్నామంటున్నారు.

First published:

Tags: Farmer, Organic Farming, Srikakulam

ఉత్తమ కథలు