లంచం తీసుకొని పనిచేయని రెవెన్యూ అధికారులు...మనస్తాపంతో రైతు ఆత్మహత్య

వారసత్వంగా సంక్రమించిన 1.06 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌లో తన పేరిట మార్పించుకోవాలని మూడేళ్లుగా తిరుగుతున్నాడు. గ్రామ రెవెన్యూ అధికారిని పదే పదే బతిమాలి తనకు పని చేసిపెట్టాలంటూ విన్నవించాడు.

news18-telugu
Updated: July 17, 2019, 8:38 AM IST
లంచం తీసుకొని పనిచేయని రెవెన్యూ అధికారులు...మనస్తాపంతో రైతు ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వినోద రాయుడు పాలెంలోని రత్తయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నాగులుప్పలపాడు మండలం ఎమ్మార్వో ఆఫీసు వద్ద పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడు.  గత రెండు సంవత్సరాల నుంచి తన పొలం ఆన్లైన్ కొరకు ఎమ్మార్వో ఆఫీసు కి తిరుగుతున్న రైతు.. వీఆర్ఓకు లంచం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా డబ్బులు తీసుకుని కూడా పనిచేయటం లేదని సోమవారం రాత్రి  వీఆర్వోతో రైతు ఘర్షణ పడ్డాడు. గత్యంతరం లేని స్థితిలో సూసైడ్ చేసుకున్నాడు.

సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి రత్తయ్య రెవెన్యూ కార్యాలయానికి వచ్చాడు. వారసత్వంగా సంక్రమించిన 1.06 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌లో తన పేరిట మార్పించుకోవాలని మూడేళ్లుగా తిరుగుతున్నాడు. గ్రామ రెవెన్యూ అధికారిని పదే పదే బతిమాలి తనకు పని చేసిపెట్టాలంటూ విన్నవించాడు. కానీ అధికారుల నుంచి కరుణ లేకపోవడంతో విచారంతో అక్కడే ఉండిపోయాడు. పక్కనే ఉన్న గృహనిర్మాణ శాఖ కార్యాలయానికి వెళ్లి తనతో తెచ్చుకున్న పురుగుమందును తాగేశాడు. ఎవరూ గుర్తించకపోవడంతో గంటల తరబడి మృత్యువుతో పోరాడి మరణించాడు.

సోమవారం రాత్రి మరణించిన రత్తయ్యను మంగళవారం మధ్యాహ్నం వరకు ఎవరూ గుర్తించలేదు. కార్యాలయాల్లో ఎవరి పనుల్లో వాళ్లున్నారు. అతడు నిద్రిస్తున్నాడేమో అనుకున్నారు. మధ్యాహ్నానికి కూడా అతడు లేవకపోవడంతో అక్కడకు వచ్చిన ప్రజలకే అనుమానం వచ్చి అధికారులకు, పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు చేరుకుని వివరాలు రాబట్టారు. స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్వగ్రామమైన వినోద రాయుడుపాలెంలో రైతు ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది

First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు