ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణది సపరేట్ స్టైల్. యాక్టర్ గా ప్రజాప్రతినిథిగా డ్యుయల్ రోల్ పోషిస్తున్న బాలయ్య.. తరచూ తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తూ సందడి చేస్తుంటారు. అందులో భాగంగా అప్పుడప్పుడు అభిమానులపై చేయి చేసుకుంటుంటారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఓ అభిమానిపై చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. వీడియో వైరల్ కావడంతో బాలయ్య వ్యవహార శైలిపై విమర్శలు వచ్చాయి. ఐతే బాలయ్య చెంపదెబ్బలపై అభిమాని స్పందించాడు. తనపేరు సోము అని.. తాను బాలయ్యకు వీరాభిమానిని అని చెప్పాడు. హిందూపురంలో బాలకృష్ణ ఉదయం నుంచి రాత్రివరకు ప్రచారం చేస్తున్నారని.. ఆయన అలసిపోయార్నాడు. అంతేకాదు తన అన్న ఇంటికి ప్రచారానికి వచ్చిన సమయంలో ఎవరో బయటివ్యక్తి అనుకొని తనను పక్కకు నెట్టేసినట్లు తెలిపాడు.
ఉదయం నుంచి ఒక్కరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వని బాలయ్య.. తనను టచ్ చేశాడంటూ హర్షం వ్యక్తం చేశాడు సోము. బాలయ్య ఈ విధంగానైనా తనను టచ్ చేయడం సంతోషంగానూ గర్వంగానూ ఉందంటునని సోము చెప్పాడు. మొత్తానికి బాలయ్య చేయి చేసుకున్న వీడియో వైరల్ అవడంతో టీడీపీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చిందని వైసీపీ నేతలంటున్నారు.
హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలయ్య తన అభిమాని చెంపపై చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. అయినా ఆయన ఆవేశం తగ్గడం లేదు. మరోసారి తన ఫ్రస్టేషన్ బయటపెట్టారు. ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థిని ఇంటికి వెళ్లారు బాలకృష్ణ. ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. ఓ అభిమాని వీడియో తీశాడు. అది గమనించిన బాలయ్య ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ అభిమాని చెంప చెళ్లుమనిపించారు. వెంటనే ఆ వీడియో డిలీట్ చేయంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడున్న వారు కూడా బాలయ్య కోపాన్ని కంట్రోల్ చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఆ అభిమానికే.. వీడియో డిలీట్ చేయాలి అంటూ సర్ధి చెప్పుకున్నారు.
అయితే బాలయ్య అభిమానిపై ఇలా చేయ చేసుకోవడం కొత్త కాదు. ఆయనకు కాస్త ఆవేశం ఎక్కువే. గతంలో కూడా రెండుసార్లు అభిమానులపై చేయి చేసుకున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాయి. విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా ఆయన పద్ధతి మారడం లేదని.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఐతే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం.. మా హీరో ప్రేమతో తమను కొడుతుంటారని క్లారిటీ ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Bala Krishna Nandamuri, Hindupuram