Home /News /andhra-pradesh /

FAMILY SURPRISES SUN IN LAW WITH 365 DISHES ON SANKRANTHI FESTIVAL IN WEST GODAVARI DISTRICT FULL DETAILS HERE PRN VSP

Sankranthi: గోదారోళ్లా.. మజాకా..! ఈ సంక్రాంతికి ఇదే హైలెట్..! కాబోయే అల్లుడికి 365 రకాల వంటలతో భోజనం..!

సంక్రాంతి అల్లుడికి 365 వంటకాలతో భోజనం

సంక్రాంతి అల్లుడికి 365 వంటకాలతో భోజనం

Sankranthi: గోదావరి జిల్లాల్లో మర్యాదలకు వంక పెట్టాల్సిన పనిలేదు. అదే సంక్రాంతి అయితే వాళ్లు చూపించే ప్రేమలో మునిగిపోవాల్సిందే. అలాంటి అదృష్టం ఓ కాబోయే అల్లుడికి దక్కింది. ఇంకా ఇంటి అల్లుడు కాకుండానే సంక్రాంతి అంటే ఏంటో చూపించారు అత్తింటివారు.

ఇంకా చదవండి ...
    సంక్రాంతి (Sankranthi) వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తెలుగు లోగిళ్లలో సందడి నెలకొంటుంది. పిండివంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, కొత్తబట్టలు, డూడూ బసవన్నల ఆటలతో ప్రతి ఇల్లు, ప్రతి పల్లె పండగ వాతావరణంలో మురిసిపోతుంటుంది. సంక్రాంతికి అన్నింటికంటే ముఖ్యమైనది కొత్త అల్లుడు. సంక్రాంతికి అత్తింటివారు అల్లుడ్ని ఇంటికి ఆహ్వానించి సకల మర్యాదలతో ముంచెత్తుతారు. ఏడాదంతా గుర్తుంచుకునేలా అల్లుడికి కొత్తబట్టలు, పిండివంటలతో రాచమర్యాదలు చేస్తారు. ఇక గోదావరి జిల్లాల్లో మర్యాదలకు వంక పెట్టాల్సిన పనిలేదు. అదే సంక్రాంతి అయితే వాళ్లు చూపించే ప్రేమలో మునిగిపోవాల్సిందే. అలాంటి అదృష్టం ఓ కాబోయే అల్లుడికి దక్కింది. ఇంకా ఇంటి అల్లుడు కాకుండానే సంక్రాంతి అంటే ఏంటో చూపించారు అత్తింటివారు. రికార్డుస్థాయిలో వంటకాలను వడ్డించి అల్లుడికి అదిరిపోయే బహుమతిచ్చారు.

    వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన ఆచంట గోవింద్ – నాదమణి కుమార్తె మాధవి, అల్లుడు వెంకటేశ్వరరావు దంపతుల కుమార్తె కుందవికి ఎన్నారై తుమ్మల పల్లి సాయికృష్ణతో ఇటీవలే పెళ్లి కుదిరింది. మనవరాలికి కాబోయే భర్తను తాతయ్య సంక్రాంతి సందర్భంగా నరసాపురంలోని ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. కాబోయే అల్లుడికి అదిరిపోయే మర్యాదలను రుచిచూపించాలని భావించిన గోవిందు కుటుంబం.. ఏకంగా 365 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.

    ఇది చదవండి: ఏపీలో స్కూళ్లకు సెలవులపై మంత్రి క్లారిటీ.., విద్యార్థులకు సర్కార్ షాక్..

    హోటల్ మెనూనే చిన్నబోయేలా 365 వంటకాల్లో అన్నం, పులిహోర, బిర్యానీలు, దద్దోజనం, చపాతీ, పరోటా, బటర్ నాన్, తందూరీ రోటీ వంటి వంటలు సిద్దం చేయించారు. అందులో 30 లకాల కూరలు, 100 రకాల స్వీట్లు, 75 రకాల హాట్ ఐటమ్స్, 15 రకాల ఐస్ క్రీమ్స్, 35 రకాల కూల్ డ్రింక్ లు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులు, ఇతర పదార్థాలతో డైనింగ్ టేబుల్ ను నింపేశారు. ఇందులో కొసమెరుపు మెరుపు ఏంటంటే ఇందులో ఒక్క నాన్ వెజ్ ఐటమ్ లేదు. అన్నీ వెజిటేరియన్ వంటకాలు సిద్ధం చేసి వెండి పళ్లెంలో వడ్డించారు. అన్ని రకాల వంటలు చూసిన కాబోయే అల్లుడుకి తినకుండానే కడుపు నిండిపోయినంత పనైంది. ఇక అమ్మమ్మ, తాతయ్యలు తనకు కాబోయే భర్తకు ఇచ్చిన సర్ ప్రైజ్ వారి మనవరాలు సంతోషంలో మునిగితేసింది. ఇక పెళ్లి కాకుండేనే మర్యాదలతో ముంచేసిన అత్తింటివారు పెళ్లైన తర్వాత ఇంకెన్ని మర్యాదలు చేస్తారన్న చర్చ కూడా మొదలైంది.

    ఇది చదవండి: ఏపీలో ఆ మంత్రి పీఏకి పీఏ.. ఆ చిన్నసార్ ఉద్యోగం ఇదే..! మంత్రిగారికి చిక్కులు తప్పవా..?


    ఇటీవల రాజమండ్రికి చెందిన ఓ వ్యాపారి తన కుమార్తెను యానాంకు చెందిన యువకుడికిచ్చి పెళ్లి జరిపించారు. ఆషాడ మాసం పూర్తైన తర్వాత కోడలిని ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లిన అత్తింటివారు వందల కిలోల స్వీట్లు, చీరలు పంపి సర్ ప్రైజ్ చేశారు. ఇక కుమార్తెను అత్తింటికి పంపిస్తూ తండ్రి కూడా అదేస్థాయిలో కావిడి పంపారు. స్వీట్లు, చీరలతో పాటు టన్నుల కొద్దీ చేపలు, రొయ్యలు, పొట్టేళ్లు పంపి ఔరా అనిపించుకున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Sankranti 2022

    తదుపరి వార్తలు