హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

టీటీడీ దర్శనం పేరుతో నకిలీ వెబ్ సైట్లు.. భక్తులూ బీ కేర్ ఫుల్..

టీటీడీ దర్శనం పేరుతో నకిలీ వెబ్ సైట్లు.. భక్తులూ బీ కేర్ ఫుల్..

కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.

కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.

ఓ భక్తుడు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేసుకోవ‌డానికి ఆన్‌లైన్లో ప్ర‌య‌త్నించ‌గా ttddarshans.com అనే న‌కిలీ వెబ్‌సైట్ క‌నిపించింది.

  తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేస్తామ‌ని భ‌క్తుల‌ను మోసం చేస్తున్న న‌కిలీ వెబ్‌సైట్‌పై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుచానూరు పోలీస్ స్టేష‌న్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. తిరుప‌తి మంగ‌ళం ఆర్‌టిసి డిపోలో కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ర‌ఘు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేసుకోవ‌డానికి ఆన్‌లైన్లో ప్ర‌య‌త్నించ‌గా ttddarshans.com అనే న‌కిలీ వెబ్‌సైట్ క‌నిపించింది. ర‌ఘు ఈ వెబ్‌సైట్ ద్వారా ద‌ర్శ‌న టికెట్ల కోసం వివ‌రాలు స‌మ‌ర్పించి ఆన్‌లైన్‌లో న‌గ‌దు బ‌దిలీ చేశారు. న‌గ‌దు బ‌దిలీ ప్ర‌క్రియ పూర్త‌య్యాక మెయిల్ ఐడికి ద‌ర్శ‌న టికెట్లు పంపుతామ‌ని ఈ న‌కిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కులు న‌మ్మించారు. ఆ త‌రువాత ద‌ర్శ‌నం టికెట్లు రాక‌పోవ‌డంతో తాను మోస‌పోయాన‌ని గుర్తించిన ర‌ఘు టిటిడి అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. స‌ద‌రు వెబ్‌సైట్ న‌కిలీద‌ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు ttddarshans.com అనే వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

  అధికారిక వెబ్‌సైట్‌లోనే టికెట్లు బుక్ చేసుకోండి : భ‌క్తుల‌కు టిటిడి విజ్ఞ‌ప్తి

  శ్రీ‌వారి భ‌క్తులు ద‌ర్శ‌న టికెట్లు, ఆర్జిత‌ సేవా టికెట్లు, గ‌దుల‌ను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ల‌ను మాత్ర‌మే వినియోగించాల‌ని టిటిడి నిఘా, భ‌ద్ర‌తా విభాగం విజ్ఞ‌ప్తి చేస్తోంది. న‌కిలీ వెబ్‌సైట్ల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. న‌కిలీ వెబ్‌సైట్ల‌ను సంప్ర‌దించి మోస‌పోయిన‌ట్టు ప‌లువురు భ‌క్తుల నుండి టిటిడికి ఫిర్యాదులు అందాయి. ఈ మేర‌కు టిటిడి నిఘా, భ‌ద్ర‌తా విభాగం అధికారులు ఇప్ప‌టికే దాదాపు 20 న‌కిలీ వెబ్‌సైట్ల‌పై పోలీస్ స్టేష‌న్ల‌లో క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయించి వాటి మీద చ‌ర్య‌లు తీసుకున్నారు.

  శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్లు, ఆర్జిత‌ సేవా టికెట్లు, గ‌దుల‌ను బుక్ చేసుకునేందుకు అధికారికంగా tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ మాత్ర‌మే ఉంది. తిరుమల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల‌కు సంబంధించిన స‌మాచారం కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. ఈ వెబ్‌సైట్ల‌కు సంబంధించిన స‌మాచారం, ఇత‌ర వివ‌రాల కోసం టిటిడి కాల్ సెంట‌ర్‌ను టోల్‌ఫ్రీ : 18004254141, 1800425333333, ల్యాండ్ లైన్ :0877-2277777, 0877-2233333 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌గ‌ల‌రు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: FAKE APPS, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd

  ఉత్తమ కథలు