అమరావతిలో రక్తం కారుతున్న మహిళ ఫొటోపై పోలీసుల క్లారిటీ...

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, మరో మహిళ మీద పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఆమె తల మీద రక్తం కారుతున్న ఫొటో ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: January 10, 2020, 2:18 PM IST
అమరావతిలో రక్తం కారుతున్న మహిళ ఫొటోపై పోలీసుల క్లారిటీ...
అమరావతిలో మహిళా రైతును పోలీసులు తల పగిలే కొట్టారంటూ ప్రచారం అవుతున్న ఫొటో
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, మరో మహిళ మీద పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఆమె తల మీద రక్తం కారుతున్న ఫొటో ఇదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొన్ని వీడియోలు, ఫొటోలు ప్రచారం అవుతున్నాయి. అయితే, అవన్నీ తప్పుడు వార్తలు అని పోలీసులు స్పష్టం చేశారు. ‘తమిళనాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జరిగినట్లు గా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియా ద్వారా కొంతమంది వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వీడియో లను ట్రో ల్ చేస్తూ ప్రశాంత వాతావరణంగా ఉన్న రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు పాల్పడుతున్నారు. ఇటువంటి అసత్య మైన వార్తలను ప్రసారం చేసిన , ఇతరులకు షేర్ చేసిన , ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఇలాంటి వార్తలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం’ అని గుంటూరు ఐజీ స్పష్టం చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 10, 2020, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading