• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • FAKE MOBILE NUMBER GONE VIRAL ON THE NAME OF ANDHRA PRADESH ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR PRN

AP Panchayat Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డ పేరుతో వాట్సాప్ నెంబర్ వైరల్... అసలు విషయం ఇదే..

AP Panchayat Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డ పేరుతో వాట్సాప్ నెంబర్ వైరల్... అసలు విషయం ఇదే..

స్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో వాట్సాప్ నెంబర్ వైరల్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికలపై (AP Panchayat Elections) ఫిర్యాదుల కోసం ఎస్ఈసీ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ (What’s App Number) ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kumar) వాట్సాప్ నెంబర్ పేరుతో నెంబర్ వైరల్ అవుతోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దశల్లో జరగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 9న తొలిదశ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. రెండో ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ఫిర్యాదులకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే E-Watch Appను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేయగా.. హైకోర్టు దానిపై స్టేటస్ కో ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ఫిర్యాదుల కోసం ఎస్ఈసీ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాట్సాప్ నెంబర్ పేరుతో నెంబర్ వైరల్ అవుతోంది.

    ప్రచారం, ఎన్నికల సందర్భంగా రాజకీయ దాడులు జరిగితే నేరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కే వాట్సాప్ ద్వారా పంపవచ్చంటూ ‘9739560529’ నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఇలాంటి నెంబర్లేవి విడుదల చేయలేదని చెప్తున్నారు. ఎవరూ ఇలాంటి నమ్మవద్దని సూచించారు. అలాంటిదేమైనా ఉంటే నేరుగానే సమాచారం ఇస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ కార్యాలయంలో 0866-2950015, 290025, 20950035 నెంబర్లతో కంట్రోల్ రూమ్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఎస్ఈసీ పేరుతో ఎలాంటి మొబైల్ నెంబర్లు సర్క్యులేట్ అయినా నమ్మిమోసపోవద్దని సూచించారు. ఐతే ఎస్ఈసీ పేరుతో ఈ నెంబర్ ఎవరు సృష్టించారనేది మిస్టరీగా మారింది. ఐతే ట్రూకాలర్ లో చెక్ చేస్తే మాత్రం SP అనిల్ అనే పేరు చూపిస్తోంది.

    ఇక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకొచ్చిన E-Watch App ను హైకోర్టు ప్రస్తుతానికి నిలిపివేసింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సీ విజిల్ యాప్ ఇప్పటికే ఉండగా, మళ్లీ కొత్తగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో యాప్ తీసుకురావడం సరికాదని, దీనిపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు ఈ వాచ్ యాప్ మీద విచారణ జరిపింది. దీనికి భద్రతా పరమైన అనుమతులు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనికి మరో 5 రోజుల్లో భద్రాపరమైన అనుమతులు వస్తాయని వాదించారు. దీంతో ఈ వాచ్ యాప్‌ను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9 వరకు యాప్‌ను అమల్లోకి తీసుకురావొద్దని స్పష్టం చేసింది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు