Extramarital Affairs: అక్రమ సంబంధాలు హత్యలుగా (Murder) మారుతున్నాయి. గతంలో భార్యలను భర్త హత్య చేశారనే వార్తలు తరచూ వింటూ ఉండేవాళ్లం.. ఇప్పుడు ప్రియుడి మోజులో (Extramarital Affair) భర్తను చంపిన హత్య అనే వార్తలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. తాజాగా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త (Husband)ను కడతేర్చింది ఓ 27 ఏళ్ల వివాహిత. 23 ఏళ్ల కుర్రాడితో ఉన్న తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడన్న కారణంతో.. చున్నీతో మెడను బిగించి చంపేసింది. భర్త చనిపోయాడని కన్ఫమ్ చేసుకున్నా తరువాత.. తనకు ఏం తెలియనట్టు.. తన భర్త సోదరుడు, బావ ఇంటికి వెళ్లి, గుండె నొప్పి అని చెప్పి రెండు మాత్రలు వేసుకొని పడుకున్నాడని, ఎంత లేపినా లేవడం లేదంటూ ఏడుస్తూ మహా నటిలా యాక్టింగ్ చేసింది.
ఆమె చెప్పింది నిజమని భావించి వెళ్లి తన తమ్ముడిని చూసిన సోదరుడికి చంపేసి ఉంటారన్న అనుమానం కలిగింది. స్థానికులు, పోలీసులు చెప్పిన వివారాల ప్రకారం. విజయనగరం జిల్లా (Vizianagaram District) బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన 40 ఏళ్ల కలిశెట్టి వెంకటరమణకు, రామభద్రపురం మండలం కొండపాలవలస గ్రామానికి చెందిన మహిళ అయిన 27 ఏళ్ల లలిత కుమారి తో 2015లో వివాహమైంది. వారికి ఐదేళ్ల బాబు, ఏడాదిన్నర వయసున్న పాప ఉన్నారు. అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల రసిల్లి నరసింగరావు అలియాస్ బాలుతో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. ఈ కారణంతోనే భార్యాభర్తల మధ్య గత కొన్నాళ్లుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఇదీచదవండి: ఏపీలో మెగా స్టూడియో..? ప్లేస్ ఫైనల్ చేశారా..? అదే దారిలో మహేష్..!
ఆ గొడవల కారణంగా వెంకటరమణ కొన్ని నెలల కిందట భార్యను కన్నవారింటికి పంపించాడు. తన భార్యలో మార్పు వచ్చి ఉంటుందేమోనని భావించి.. మళ్లీ భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. నిత్యం గొడవలు పడుతూనే ఉన్నారు. అయితే తాజాగా అదే ఊరిలో ఉండే తన బావ, కలిశెట్టి వెంకట రమణ సోదరుడు కలిశెట్టి అప్పలనాయుడు ఇంటికి గురువారం రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లింది ఏళ్ల లలిత. తన భర్తకు గుండెనొప్పి అని చెప్పి రెండు మాత్రలు వేసుకొని పడుకున్నాడని... ఎంత లేపినా లేవడం లేదని ఏడుస్తూ చెప్పింది.
ఇదీచదవండి: సీఎం కుటుంబ సభ్యుల్లో ఒకరికి కీలక పదవి.. రాజధానికి ముహూర్తం ఫిక్స్..?
దీంతో కలిశెట్టి అప్పలనాయుడు వెంటనే వెళ్లి చూడగా సోదరుడు మృతిచెంది ఉన్నాడు. తన సోదరుడి మ్ళతదేహం మెడ పైనా, ఎడమ దవడ పైనా, కుడి చేతిపైనా గాయాలు ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే తన బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఎప్పటినుండో మరదలి మధ్య అక్రమ సంబంధం కారణంగా గొడవలు జరుగుతున్న కారణంగా తన మరదలు లతిత కుమారి చంపేసి ఉంటుందని అనుమానించాడు. వెంటనే సోదరుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. శుక్రవారం తెల్లవారుజామునే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదీచదవండి: ఆయన కోరుకున్న పదవి వరిస్తోందా.. సీఎం జగన్ హామీ ఇచ్చారా.. అందుకేనా ఆ దూకుడు
వెంకరమణ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు భార్య, భార్య కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు కలిశెట్టి వెంకరమణ ఇంటికి చేరకున్నారు. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు చేస్తున్న ఏర్పాట్లను అడ్డుకున్నారు. వెంటనే మృతదేహాన్ని పరిశీలించి.. వెంకటరమణ మెడకు చున్నీ బిగించి, హత్య చేసి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం కోసం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మ్ళతుని సోదరుడి ఫిర్యాదుతో.. నిందితులలో ఒకరైన తన ప్రియుడు బాలును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో కలిశెట్టి వెంకటరమణ ఎలా చంపామో పూసగుచ్చినట్టు చెప్పడంతో.. భార్య లలితకుమారి ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.