హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Extramarital Affair: ఈ భార్య తెలివికి షాక్ అవ్వాల్సిందే..? ప్రియుడి మోజులో ఏం చేసిందంటే..?

Extramarital Affair: ఈ భార్య తెలివికి షాక్ అవ్వాల్సిందే..? ప్రియుడి మోజులో ఏం చేసిందంటే..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Extramarital Affair: భర్త అంటే ప్రాణం అంటూ అందరికి చెబుతూ వచ్చింది. చూసినవారంతా వీరిది ఎంత అన్యోన్య దాంపత్యం అనుకునే వారు.. ఓ రోజు భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కానీ తరువాత ఏం జరిగింది అంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Chittoor, India

  GT Hemanth Kumar, Tirupathi, News18

  Extramarital Affair:  పచ్చని కాపురాలు కుప్ప కూలుతున్నాయి. సంతోషంగా సాగుతున్న సంసారాలు చిన్న చిన్న తప్పులకు.. నాశనం అవుతున్నాయి. ముఖ్యంగా పరాయి మోజులో.. చేజేతులా తమ జీవితాలను పతనమయ్యేలా చేసుకుంటున్నారు కొందరు. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల (Extramarital Affair) కారణంగా.. హత్యలు, హత్యా యత్నాలు పెరుగుతున్నాయి. మహిళలు కూడా తగ్గేదే లే అంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా (Chittoor District), కుప్పం మండలం (Kuppam Mandal), గరిగచిన్నేపల్లి గ్రామానికి చెందిన హరీష్ కుమార్ కి స్నేహతో గత కొద్ది ఏళ్ళ క్రితం పెద్దల సమక్షంలో వివాహం (Marriage) జరిగింది.. పెళ్లైన తర్వాత కొద్ది రోజుల పాటు గ్రామంలో‌ ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు హరిష్.. అయితే అంతగా ఆదాయం లేక‌పోవడంతో తెలిసిన వారితో సంప్రదించి హైదరాబాదులో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ పనికి చేరి నెల నెల డబ్బులు పంపేవాడు..

  భర్త పంపిన డబ్బుతో కుటుంబాన్ని పోషించు కోవడంతో‌ పాటు అత్త, మామలను బాగా చూసుకునేది స్నేహా.. ఈ సమయంలోనే పక్క గ్రామానికి చెందిన టేకుమాను తాండా చెందిన సతీష్ నాయక్ తో పరిచయం ఏర్పడింది.. వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.. సతీష్ నాయక్ తో అక్తమ సంబంధం సాగిస్తూ, భర్తతో ఎప్పుడూ లాగే ఫోన్ లో ముచ్చట్లు చెబుతూ నమ్మించేది.

  హైదరాబాదు లో గ్రానైట్ ఫ్యాక్టరీ లో‌ పని దొరక్క పోవడంతో హరీష్ తిరిగి సొంత గ్రామానికి చేరుకుని.. ఏదోక పని చేసుకోవాలని భావించి సొంత గ్రామానికి చేరుకున్నాడు. అప్పటి నుండి గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు హరీష్.. అయితే తమ సంబంధానికి భర్త హరీష్ కుమార్ అడ్డు వస్తున్నాడని గ్రహించిన స్నేహా అతడిని అడ్డు తొలగించుకోవాలని స్కేచ్ వేసింది. ప్రియుడు సతీష్ నాయక్ కి సందేశం పంపింది.. సతీష్ అతని స్నేహితులు కుమార్ నాయక్, శ్రీధర్ నాయక్, చరణ్ నాయక్, బాలాజీలకు విషయం చెప్పి ప్రియురాలి భర్తను హత మార్చేందుకు ఐదు లక్షల రూపాయలకు సుపారి ఇచ్చి, ముప్పై వేల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు.

  ఇదీ చదవండి : ఈ భార్య తెలివికి షాక్ అవ్వాల్సిందే..? ప్రియుడి మోజులో ఏం చేసిందంటే..?

  స్నేహా, సతీష్ నాయకులు ముందస్తుగా వేసుకున్న పధకం ప్రకారం కృష్ణపురం అటవీ ప్రాంతంలో స్నేహితుడు డబ్బులు ఇస్తారని అక్కడికి వెళ్లి తీసుకొని రావాలని స్నేహ భర్తకు తెలపడంతో వెళ్లిన హరీష్ ని అక్కడే కాపు కాసిన ఐదు మంది ఒక్కసారిగా కత్తులతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. గత నెల 25వ తేదిన తన భర్త హరీష్ కనిపించడం లేదని స్నేహా కుప్పం పోలీసులకు పిర్యాదు చేసింది.

  ఇదీ చదవండి : బాహుబలి భర్తను చూశారా..? ఏం చేశాడో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..?

  దీంతో కేసు‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగించారు.. ఈ సమయంలో గత నెల 28వ తేదీన కృష్ణాపురం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు.. ఇదే విషయంను స్నేహకి‌ ఫోన్ చేసి హరీష్ మృతిదేహం అవునో కాదో అని తేల్చేందుకు పిలిపించారు. ఆ సమయంలో స్నేహా ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమ స్టైల్ లో విచారణ జరిపారు.. దీంతో అసలు విషయం బట్ట బయలు అయ్యింది.. దీంతో ఆరు మంది నిందుతులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chitoor, Crime news, Extra marital affair

  ఉత్తమ కథలు