Extramarital Affair: మంచి నిద్రలో ఉన్న భర్తకు దాహం వేసి.. మధ్యలో మెలుకువ వచ్చింది. వెంటనే నీళ్లు తాగుదామని.. వంట గదిలోకి వెళ్లాడు. అలా వెళ్లడమే పాపమైంది.. అక్కడికి వెళ్లిన భర్త (Husband).. ఆ వంట గదిలో తన భార్య (Wife) మరో అబ్బాయితో ఉండడాన్ని చూశాడు.. ఏంటి ఈ పని నిలదీశాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమోకాని.. ఆ భార్య ఏడుస్తూ.. భర్త సొదరుడు ఇంటికి వెళ్లింది. తన భర్తకు రాత్రి గుండెపోటు వచ్చిందని.. మాత్రలు వేసుకుని నిద్రపోయిన ఆయన.. ఇంకా నిద్ర లేవలేదని రోధించింది. దీంతో కంగారు పడ్డ అందరూ అక్కడికి వెళ్లి చూడగా.. ఆయన అప్పటికే మరణించాడు. గుండెపోటుతో మరణించాడు అనుకున్న అతడి మెడపై ఎదో గాయం లాంటింది కనిపించడంతో ఆ సోదరుడు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానం వ్యక్తం చేసి విచారణ చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు స్థానికులు చెప్పిన వివరాలు ప్రకారం. విజయనగరం జిల్లా (Vizianagaram District) బొబ్బిలి మండలంలోని పారాది గ్రామంలో గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కలిశెట్టి వెంకటరమణ కేసు మిస్టరీ వీడింది అన్నారు. వెంకటరమణను భార్య లలితకుమారి, ఆమె ప్రియుడు రసిల్లి నరసింగరావు అలియాస్ బాలు కలిసి హతమార్చినట్టు పోలీసులు నిర్ధారించారు. పారాదికి చెందిన నరసింగరావుతో కొద్ది సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం గతంలో రేగింది. ఘటన జరిగిన మొన్న రాత్రి 10 గంటల సమయంలో భర్త నిద్రిస్తున్న సమయంలో లలితకుమారి సెల్‌కు ప్రియుడు మెసేజ్ చేశాడు. చూడాలి అని ఉందని కోరాడు. వెంటనే ఆమె తన భర్త నిద్రిస్తున్నాడని భావించి.. వీడియోకాల్ చేసి కాసేపు మాట్లాడింది. ఆ వీడియోకాల్ తరువాత వెంటనే కలవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్లాన్ ప్రకారం.. భర్త నిద్రలో్ ఉన్నాడని భావించి ఇంట్లోనే కలిశారు.
ఇదీ చదవండి : కూతురు కంటే ఘనంగా గోవుకి సీమంతం.. 500 మందికి దంపతులను ఆహ్వానించి ఏం చేశారంటే?
అదే సమయంలో వెంకటరమణి.. మంచినీళ్లకోసం వంటగదిలోకి వచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఇద్దర్నీ గమనించాడు. ఛీ ఇదేం పని అని వారిని నిలదీశాడు. దీంతో ముగ్గురు మధ్య మాటకు మాట పెరిగింది. భార్యతో సహా ఆమె ప్రియుడుని వెంకటరహణ కొట్టాడు. వారు ప్రతిదాడి చేసి వెంకటరమణను గాయపరిచి, గోడకు గుద్దారు. అనంతరం భార్య చున్నీతో భర్త వెంకటరమణను ఉరి తీసి చంపేసారు. మృతదేహాన్ని ఇంట్లో ముందర గదిలో ఉంచేసి, ప్రియుడు పరారీ అయ్యాడు. రాత్రి సమయంలో లలితకుమారి తన బావ అప్పలనాయుడు ఇంటికి వెళ్లి తన భర్త గుండెపోటుతో చనిపోయాడని బుకాయించింది. రెండు ట్యాబ్లెట్లు ఇచ్చానని చెప్పడంతో అప్పలనాయుడు, స్థానికులతో కలిసి వచ్చి చూసి ఉదయం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి : పీఎస్ఎల్వీ సి-52 కౌంట్ డౌన్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..
మృతదేహానికి స్నానం చేయిస్తున్న సమయంలో గాయాలు గమనించిన బంధువులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నాగేశ్వరరావు సిబ్బందితో గ్రామంలో విచారణ చేపట్టారు. దీంతో లలితకుమారి, నరసింగరావులను శనివారంఅరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కోర్టు వీరికి రిమాండ్ విధించింది. నరసింగరావు సీతానగరం, పార్వతీపురం ప్రాంతాల్లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారంలో లలితకుమారి, వెంకటరమణ తరచూ గొడవలు పడి లలితకుమారి పలుసార్లు పుట్టింటికి వెళ్లినట్టు గ్రామస్తులు తెలిపారు. నరసింగరావు, లలితకుమారి ఎక్కడికైనా వెళ్లిపోదామని ప్రతిపాదనలు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : ఏపీలో రోజుకో పుష్పా సీన్.. కొత్త ఐడియాలతో సవాల్..? పోలీసులకే షాక్
వెంకటరమణ హత్యకు గురి కాగా, లలితకుమారి అరెస్టు కావడంతో అభం శుభం తెలియని ఐదేళ్ల బాబు హర్షవర్దన్, ఏడాదిన్నర పాప యశస్విని రోడ్డున పడ్డారు. వీరిని బంధువుల పర్యవేక్షణలో ఉంచారు. వీరి పరిస్థితి ఏమిటన్నదీ అందరినీ కలచివేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.