30 ఇయర్స్ పృథ్వీరాజ్‌‌కు గాయాలు...  

తిరుమలలో పృథ్వీరాజ్

ఎస్వీబీసీ మాజీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చాలా రోజుల తర్వాత కెమెరాకు కనిపించారు.

 • Share this:
  ఎస్వీబీసీ మాజీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చాలా రోజుల తర్వాత కెమెరాకు కనిపించారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆయన తాజాగా తిరుమలలో కనిపించారు. తిరుమల కొండ మీద కాలికి చెప్పులు లేకుండా, భుజానికి, చేతికి కలిపి ఓ కట్టు కట్టుకుని ఉన్నారు. చేతిలో కర్చీఫ్ ఉంది. పృథ్వీరాజ్ పక్కనే భద్రత కోసం ఓ వ్యక్తి కనిపించారు. తిరుమల కొండకు ఆయన నడిచి వెళ్లినట్టు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత ఆయన కెమెరా ముందు కనిపించారు. ఆయన భుజానికి గాయం అయినట్టు కనిపిస్తోంది. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో పృథ్వీరాజ్ అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో టేప్ తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయన ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పద్మావతి గెస్ట్ హౌస్‌లో మందుకొట్టానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అది రుజువైతే తనను చెప్పుతో కొట్టాలని చెప్పు చూపించారు పృథ్వీ. ఇప్పుడే డాక్టర్‌ని తీసుకొచ్చి రక్త పరీక్షలు చేయిస్తే.. తాను తాగుబోతునో కాదో తెలుస్తుందని అన్నారు.

  30 ఇయర్స్ పృథ్వీ భుజానికి పట్టీ


  కొందరు కావాలనే తనను కుట్రపన్ని ఇరికించారని అప్పట్లో పృథ్వీరాజ్ ఆరోపించారు. ‘నన్ను ఏ రకంగా దెబ్బకొట్టాలని ఒకటే ఆలోచించారు. నా గొంతు నొక్కేయాలని చూశారు. నేను శబరిమలలో ఉన్నప్పుడు మీడియా మిత్రుడు ఒకరు ఫోన్ చేశారు. అతని పేరు మాత్రం నేను చెప్పను. నా మీద పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. నా మీద కుట్ర చేయడం ఏంటి? నేనేమన్నా స్కాముల్లో ఉన్న మంత్రినా?, హత్యలు చేశానా?, రౌడీ షీటర్‌నాఅనుకున్నా. నా వాయిస్ కొంతమందికి అడ్డంగా ఉందని చెప్పాడు. ఆ గొంతు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిపాడు. చైర్మన్ పదవిలో ఉంచకూడదని, అదఃపాతాళానికి తొక్కేయాలని కుట్ర చేసినట్టు చెప్పారు. కానీ, నేను స్వామిని నమ్ముకున్నా. అవేమీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, అది ఇంతవరకు దారితీస్తుందనుకోలేదు.’ అని పృథ్వీరాజ్ తన రాజీనామా ప్రకటన సందర్భంగా చెప్పారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: