హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Undavalli: ఏపీ అప్పులు 6 లక్షల కోట్లు.. ఇలా అయితే కష్టమే..? జగన్ సర్కార్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

Undavalli: ఏపీ అప్పులు 6 లక్షల కోట్లు.. ఇలా అయితే కష్టమే..? జగన్ సర్కార్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

Undavalli on cm Jagan: వైఎస్ జగన్ సర్కార్ తీరుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండల్లి అరుణ్ కుమార్. ముఖ్యంగా అప్పులు.. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు సరైంది కాదన్నారు. ఇలాగే ఉంటే భవిష్యత్తు కష్టమే అన్నారు.

Undavalli on CM Jagan: వైఎస్ జగన్ సర్కార్‌ (YS Jagan Government)పై మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమండ్రి(Rajamundry)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ఉండవల్లి ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు 6 లక్షల కోట్ల అప్పు చేసిందని.. అమరావతి (Amaravathi)ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని ఆయన అన్నారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నా అసలు ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? అని మాజీ ఎంపీ ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని.. దీంతో కేంద్ర ప్రభుత్వం (Central Government)తో సహా అన్ని ప్రభుత్వాలు చులకనగా చూస్తారని ఆయన మండిపడ్డారు..

‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు (one Nation one ration Card)కు దేశంలోని ఏ రాష్ట్రం ఒప్పుకోకపోయినా ఏపీ మాత్రం దీనికి ఒప్పుకుంది. పోలవరం (Polavaram)పై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రాజెక్ట్‌ పనులు పూర్తికాకపోయినా హడావుడిగా ప్రకటనలు చేస్తున్నారు. పోలవరం పనుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. ప్రాజెక్ట్‌కు సంబంధించి 4,068 కోట్ల రూపాయల కొర్రీలు వేశారు.

ఇదీ చదవండి: సెంటు భూమిలో ఇళ్లా..? నిర్మాణాలు చేపట్టవద్దన్న కోర్టు.. జగన్ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్

పనులు పూర్తి కాకపోయినా మంత్రులు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఉన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది. నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందడంలేదు. తాగునీటి విషయంలో పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వకపోవడం దారుణం. పోలవరం నిధులపై రాష్ట్రం ఏర్పాటు నుంచి చర్చ జరుగుతోంది. పోలవరం నిధులపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:నలుగురూ అమ్మాయిలే.. అబ్బాయి కావాలనుకున్నారు.. చివరికి పోలీసులకు చిక్కారు

ఎన్నికల తర్వాత ఇద్దరి సీఎంల మధ్య సఖ్యత ఉంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు సెటిల్ అవుతాయనుకున్నా.. కానీ రెండున్నరేళ్లుగా ఏం జరగలేదన్నారు. తెలంగాణలో ఉన్న ఆస్తుల విషయం కూడా ఏమీ మాట్లాడలేదన్నారు. కేసీఆర్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడతారు.. చాలా ఆలోచించి మాట్లాడతారని.. ఆంధ్రాలో ఎవరూ అలా మాట్లాడలేరని.. రాజకీయం అంటే మాటలన్నారు.

ఇదీ చదవండి: రియల్ లైఫ్ లో స్పైడర్ సినిమా.. శ్మశానంలో కాపురాలు.. సమాధులే పట్టు పరుపులు.. ఎక్కడో తెలుసా?

ఉచిత పథకాలు 2024 ఎన్నికల వరకు ఇవ్వగలిగితే మళ్లీ జగన్ గెలుస్తారన్నారు ఉండవల్లి.. అందులో అనుమానం లేదన్నారు. కరోనా కల్లోలం నుంచి బయటపడాలంటే ప్రజల అకౌంట్‌లో డబ్బులు వేయాలని చాలామంది నిపుణులు చెప్పారని.. ఆ డబ్బు మార్కెట్‌లోకి వస్తుంది, రోటేషన్ జరిగితే జీడీపీ ఉంటుందన్నారు. కారణాలు వేరైనా నవరత్నాలతో అందరి అకౌంట్‌లలో డబ్బులు వేశారని.. ఎప్పుడూ అలా చేయాలంటే అసాధ్యమన్నారు.

ఇదీ చదవండి: మంత్రి అవంతి బెర్త్ దక్కేదెవరికి..? రేస్ లో ఉన్నామంటున్న సీనియర్లు

ఏపీలో జీతాలు ఆలస్యమవుతున్నాయి, ఆస్తులు అమ్ముతున్నారని అరుణ్ కుమార్ కామెంట్ చేశారు. డబ్బులు ఇస్తే మంచిది కానీ ఎలా ఇస్తున్నారన్నది చూడాలన్నారు.. ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది, ఇక ఇబ్బందులు తప్పవన్నారు. దేశంలో కూడా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Politics, Undavalli Arun Kumar

ఉత్తమ కథలు