ఉండవల్లి వైసీపీలో చేరుతున్నట్లేనా... ఆ పుస్తకంతో సెన్సేషన్ సృష్టించబోతున్నారా.. ?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ (File Images)

AP Assembly Election 2019 : ఎన్నికల ఫలితాలకు టైమ్ దగ్గర పడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. వాటిలో మరో కీలక ఘట్టం ఇవాళ జరగబోతోంది.

  • Share this:
చాలాకాలం సైలెంట్‌గా ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్... ఈమధ్య ఫుల్ యాక్టివ్ అయిపోయారు. తరచూ రకరకాల వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. పోలవరం ఇప్పట్లో పూర్తి కాదనీ టీడీపీని టార్గెట్ చేసిన ఆయన... తాజాగా చంద్రబాబుకి ప్రధాని అయ్యే ఛాన్సుందంటూ మరో షాకింగ్ కామెంట్ చేశారు. ఐతే, ఆయన వైసీపీలో చేరబోతున్నారనీ, వైసీపీ అధికారంలోకి వస్తే, ఆయనకు అత్యంత కీలక మంత్రి పదవి ఇవ్వబోతున్నారనీ... ఇప్పటికే దీనిపై మంతనాలు జరిగాయనీ తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఉండవల్లి చర్యలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి.

మాటకారి అయిన ఉండవల్లి... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ హయాంలో ఎన్నో రాజకీయ అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ సొంతం చేసుకున్న ఉండవల్లి... వాటికి సంబంధించి ఓ కొత్త పుస్తకం రాశారు. ఎమెస్కో పబ్లికేషన్స్ ప్రింట్ చేసిన ఈ పుస్తకాన్ని నేడు హైదరాబాద్ దసపల్లాలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆవిష్కరించబోనున్నారు. ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ రాబోతున్నారు. ఈ పుస్తకంలో ఉండవల్లి ఏయే అంశాల్ని ప్రస్తావించారు, ప్రజలకు తెలియని అంశాలేంటి అన్నదానిపై చర్చ మొదలైంది.

ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ అనుమతుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు.. అందుకోసం ఉండవల్లి అరుణ కుమార్‌కు ఎలాంటి సూచనలు చేశారు అనే దానిపై ఈ పుస్తకంలో వివరాలుండబోతున్నాయి. అలాగే హిందూ మతంపై వైఎస్‌కు వుండే నమ్మకం, తనను నమ్మినవారికి వైఎస్ అండగా ఉండే విధానం, అందుకోసం ఆయన తీసుకునే బలమైన నిర్ణయాలు, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడం, రాజీవ్ సభల్లో వైఎస్, ఉండవల్లి అనుభవాలు, అసెంబ్లీలో ఉండవల్లి అంబేద్కర్‌ను అవమానించలేదంటూ అసెంబ్లీలో అరుణ కుమార్‌కి మద్దతుగా వైఎస్ చేసిన ప్రసంగం, రామోజీరావు సంస్థ మార్గదర్శి చిట్స్‌పై కేసు వంటి ఎన్నో ఆసక్తికర అంశాలు ఈ పుస్తకంలో ఉండబోతున్నట్లు తెలిసింది.

తాము అధికారంలోకి వస్తే ఉండవల్లిని తమ పార్టీలోకి గ్రాండ్‌గా ఆహ్వానించేందుకు వైసీపీ సిద్ధపడిన సమయంలో... ఉండవల్లి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన పుస్తకాన్ని రిలీజ్ చేస్తుండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. మరో వారంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న తరుణంలో ఈ పుస్తకం విడుదలవుతుండటం శుభ పరిణామం అంటున్నారు వైసీపీ నేతలు. తాము అధికారంలోకి వచ్చే సమయంలో... వైఎస్‌ఆర్‌ సేవలు, ఆయన చేసిన మంచి పనులను ప్రజలు మరోసారి ఈ పుస్తకం ద్వారా గుర్తుచేసుకుంటారని చెబుతున్నారు. వారు అనుకున్నట్లు ఉండవల్లి వైసీపీలో చేరితే... ఆ పార్టీకి అది ప్లస్ పాయింటే. అది జరగాలంటే వైసీపీ అధికారంలోకి రావాలి. అప్పుడు మాత్రమే ఉండవల్లి ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారనీ, లేదంటే ఎప్పట్లాగే తటస్థంగా ఉంటారని తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

రాయపాటికి రూ.400 కోట్లు ఇవ్వడానికే ఏపీ కేబినెట్ మీటింగ్... వైసీపీ ఆరోపణ...

మంగళగిరిలో లోకేష్‌కి భారీ మెజార్టీ... టీడీపీ రిపోర్టులో ఏం తేలిందంటే...

మా తమ్ముడు బంగారం... పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్...

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?

జగన్ కి శ్రీ రెడ్డి సపోర్ట్... వైసీపీ లోకి ఎంట్రీ..? మరో రోజా అవుతారా..?

 

First published: