సీఎం జగన్ ఆ విషయంలో చంద్రబాబు కంటే చాలా బెస్ట్...టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...

కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా చురుగ్గా పనిచేస్తున్నాడని, ఏదైనా మీటింగ్ అరగంటలో ఫినిష్ చేస్తున్నాడని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు చాదస్తంగా ప్రతీ విషయం క్షుణ్నంగా చెప్పే అలవాటు ఉందని, అది మానుకొని సూటిగా సుత్తి లేకుండా చెప్తేనే జనాలకు, కానీ నాయకులకు కానీ అర్థం అవుతుందని జేసీ చెప్పారు.

news18-telugu
Updated: November 10, 2019, 7:06 PM IST
సీఎం జగన్ ఆ విషయంలో చంద్రబాబు కంటే చాలా బెస్ట్...టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...
సీఎం జగన్, చంద్రబాబునాయుడు
  • Share this:
చంద్రబాబు గంటలు గంటలు చర్చలు ఆపేస్తేనే టీడీపీ బాగుపడుతుందని, చిన్నవాడైనప్పటికీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి సూటిగా, సుత్తి లేకుండా పనిచేసుకుంటూ పోతున్నాడంటూ మాజీ ఎంపీ జేసీ. దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు గురించి పలు కామెంట్స్ చేశారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదైనా సమీక్ష చేస్తే గంటలు గంటలు కాలం తినేస్తాడని, తామేమీ చిన్న పిల్లలం కాదని, అన్ని విషయాలు తెలుసుఅంటూ చురకలు అంటించాడు. అంతేకాదు కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా చురుగ్గా పనిచేస్తున్నాడని, ఏదైనా మీటింగ్ అరగంటలో ఫినిష్ చేస్తున్నాడని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు చాదస్తంగా ప్రతీ విషయం క్షుణ్నంగా చెప్పే అలవాటు ఉందని, అది మానుకొని సూటిగా సుత్తి లేకుండా చెప్తేనే జనాలకు, కానీ నాయకులకు కానీ అర్థం అవుతుందని జేసీ చెప్పారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి కుర్చీ వేసుకొని పార్టీలోని సమస్యలను వినాలని, అంతేకానీ చుట్టూ ఉన్న వందిమాగధుల మాటలు వింటే లాభం లేదని అన్నారు.

mp jc diwakar reddy,mla yamini bala, mlc shamanthakamani,kotla surya prakash reddy,tdp,singanamala ticket, ap assembly elections 2019, జేసీ దివాకర్ రెడ్డి, యామిని బాల, శకంతకమణి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సింగనమల,
జేసీ దివాకర్‌రెడ్డి(ఫైల్ ఫోటో)
First published: November 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading