ఆ విషయంలో జగన్ కు నా హ్యాట్సాఫ్...జేసీ సంచలన వ్యాఖ్యలు...

ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు తనను ఆకట్టుకుందని అన్నారు. అలాగే కేంద్రంలో ఎన్డీఏ కూటమికి 250 సీట్లలోపే రావాలని కోరుకున్నట్లు నిజాయితీ చెప్పారని ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని జేసీ అన్నారు.

news18-telugu
Updated: May 29, 2019, 8:03 PM IST
ఆ విషయంలో జగన్ కు నా హ్యాట్సాఫ్...జేసీ సంచలన వ్యాఖ్యలు...
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
news18-telugu
Updated: May 29, 2019, 8:03 PM IST
ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు మాట్లాడారని, కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి అఖండ మెజారిటీ రావడం వల్ల ప్రస్తుతం, డిమాండ్ చేసే స్థాయిలో లేమని నిజాయితీగా ఒప్పుకున్నాడని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మీడియాకు దూరంగా ఉన్న జేసీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు తనను ఆకట్టుకుందని అన్నారు. అలాగే కేంద్రంలో ఎన్డీఏ కూటమికి 250 సీట్లలోపే రావాలని కోరుకున్నట్లు నిజాయితీ చెప్పారని ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని జేసీ అన్నారు. దీంతో పాటు జగన్ ఢిల్లీలో మోదీకి గౌరవంగా నమస్కారం పెట్టి రాష్ట్రంలో పరిస్థితిని వివరించి సహాయం అడుతున్నారని, సిగపట్లకు, మెడపట్లకు పోకుండా హుందాగా వ్యవహరిస్తున్నాడని జేసీ పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రానికి సంబంధించి తాను ఎలాంటి పోరాటాలకు దిగడం లేదని అన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గించడమే, తన ఎజెండా అని, ఎన్నికల్లో సంస్కరణలపై తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలినాళ్లలో ఓటుకు పది రూపాయలు ఇచ్చేవారని, ఇప్పుడు అది వేలల్లోకి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సంస్కరణల కోసం జస్టిస్ చలమేశ్వరరావు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జయప్రకాశ్ నారాయణ, మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి, జేడీ. లక్ష్మీనారాయణ, ఐవీఆర్ కృష్ణారావు, జస్టిస్ లక్ష్మణ్ రావు, మాజీ ఎన్నికల ప్రధానాధికారి జెఎం. లింగ్డో, కాకి మాధవరావు వంటి వారిని కలుస్తానని అన్నారు.

First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...