రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్ట్..

వైద్యపరీక్ష అనంతరం హర్షకుమార్‌ని రాజమండ్రి 7వ అదనపు కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు పోలీసులు.

news18-telugu
Updated: December 13, 2019, 9:33 PM IST
రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్ట్..
వైద్యపరీక్ష అనంతరం హర్షకుమార్‌ని రాజమండ్రి 7వ అదనపు కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు పోలీసులు.
  • Share this:
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ సిబ్బందిని దూషించిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయనపై 353,323,506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. వైద్యపరీక్ష అనంతరం హర్షకుమార్‌ని రాజమండ్రి 7వ అదనపు కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. హర్షకుమార్‌కు బెయిల్ నిరాకరించిన జడ్జి..14 రోజలు రిమాండ్ విధించారు. దాంతో ఆయన్ను భారీ భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు.

నాన్ బెయిలబుల్ కేసుతో హర్షకుమార్ కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. 76 రోజుల తర్వాత ఆయన రాజమండ్రికి వచ్చారు. ఈ క్రమంలో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఐతే పోలీసుల తీరుపై హర్షకుమార్ అనుచరులు మండిపడుతున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: December 13, 2019, 8:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading