Home /News /andhra-pradesh /

EX MINSTER ASHOK GAJAPATI RAJU REGISTERED PETITION AGAINST ANDHRA APRADESH GOVERNMENT NGS VZM

Ashok Gajapati Raju: కుటుంబాన్ని కూడా రోడ్డుకు లాగుతారా..? హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతి రాజు

రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత

రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత

Ashok Gajapati Raju: రామతీర్థం శంకుస్థాపన వివాదంలో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిపై పోలీసు కేసులు నమోదు కాగా.. ఆయన ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వివాదం ఎటు తిరుగుతుందో చూడాలి..

  Ashok Gajapati Raju:  రామతీర్థం శంకుస్థాపన వివాదం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. చివరకు కేసుల వరకు వెళ్లింది. అయితే ఈ కేసులు నతకు ఏమీ కొత్త కాదని.. కానీ తన కుటుంబాన్ని రోడ్డుపైకి లాగడం సరిగ్గా లేదంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. .రామతీర్థం ఘటనలో మంత్రులు మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. తనపై లేని పోని కేసులు పెట్టి వేధించాలి అని చూస్తుండడం దారుణమన్నారు.  ఇక ఆ కేసుల విషయంపై హైకోర్టు ని ఆశ్రయించినట్టు తెలస్తోంది. అసలు వివదానికి జయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై జరిగిన శంకుస్థాపనే ప్రధాన కారణం. ఆ వివాదం చిలికిచిలికి  గాలివానగా మారుతోంది.

  ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటనల్లో కేంద్ర మాజీ మంత్రి, రామతీర్ధం ఆలయ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుకు నెల్లిమర్ల పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు అందించారు. శంకుస్దాపనలో అతిగా వ్యవహరించి, విధులకు ఆటంకం కలిగించారంటూ ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు 427, 353 సెకన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి ఈ నోటీసులు అందజేసారు. అవసరమైన సమయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని, సహకరించాలని తెలిపారు. ఇక నోటీసులు, కేసులపై అశోక్ గజపతిరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించి.. నెలిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరారు. ఇక ఈ మొత్తం ఘటనలపై అశోక్ గజపతిరాజు స్పందించారు.

  400 సంవత్సరాల చరిత్ర ఉన్న రామతీర్ధంలో ఎన్నడూ లేని ఘటనలు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరగటం బాధాకరమన్నారు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు. దేవస్ధానానికి సమర్పించే కానుకలకు కూడా మంత్రులు అనుమతులు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది దేశద్రోహ కుటుంబమని జిల్లాకు చెందిన ఒక మంత్రి అన్నారని.. ఈ సందర్భంగా ఆయనకి దండం పెట్టాలంటూ తన ఆవేదన వ్యక్తం చేసారు.

  మంత్రి వెల్లంపల్లి శంకుస్దాపన సందర్భంగా అశోక్ గజపతిరాజు వ్యవహరించిన తీరు చట్టవిరుద్దమని, చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం, ఆ రోజు రాత్రి రామతీర్థం ఆలయ ఈఓ ప్రసాద్ నెల్లిమర్ల పీఎస్ లో ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించి.. నెలిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

  పోలీసుల నోటీసుల తర్వాత.. విజయనగరం లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న రామతీర్థంలో ఎన్నడూ లేని ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో జరగడం చాలా బాధాకరమన్నారు. మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో ఉన్న ఆలయాలకు సంబంధించి ఏ విషయం అడిగినా అధికారులు చెప్పటం లేదని మండిపడ్డారు. ఆఖరికి తను సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నా.. సింహాచలం దేవస్థానానికి వెళ్లే ముందు కింద టోల్ గేట్ కూడా కట్టే వెళ్తున్నాని, ఒకవేళ టోల్ గేట్ కట్టకపోతే కేసు పెడతారనే భయమేస్తోందంటూ.. ఎద్దేవా చేశారు. ప్రతీసారి కేసులు పెట్టి తనని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, దాని గురించి ప్రస్తుతం నేనేమి మాట్లాడకూడదని తెలిపారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా చెడ్డవారి చేతిలో పడితే చెడ్డగా, మంచి వారి చేతిలో పడితే మంచే అవుతుందని అంబేద్కర్ చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP High Court, AP News

  తదుపరి వార్తలు