Minster vs Ex Minster: మంత్రి, మాజీ మంత్రి మధ్య వివాదానికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు.. రోజు రోజుకూ.. నెల్లూరు (Nellore) వైసీపీ (YCP) రాజకీయాల్లో రచ్చ మరింత పెరుగుతోంది. అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) అయితే ఓ మెట్టుపైనే ఉన్నారు. కార్యకర్తల సమావేశంలో తనకు ఎవరూ పోటీ కాదని.. తనకు తానే పోటీ అన్నారు అనిల్. అంతేకాదు ఆ సమావేశంలో ఎక్కడా మంత్రి ఫోటో కనిపించలేదు. ఇటు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (kakani Govardhan Reddy) సైతం.. అనిల్ కు వ్యతిరేకంగా ఉన్న నేతలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నారనే ప్రచారం ఉంది. అనిల్ మినాహా మిగిలిన ఎమ్మెల్యేలను అందరినీ స్వయంగా కలుస్తూ.. వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంటే అనిల్ ను ఒంటరి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని ప్రచారం ఉంది.
మరోవైపు మంత్రి ర్యాలీ సంద్భంగా అనిల్ కుమార్ యాదవ్ ఫ్లెక్సీలు తొలగించడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. తాజాగా మరోసారి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తనపై విమర్శలు చేసిన ఆనంలా. తాను పార్టీలు మారలేదని నేరుగా కౌంటర్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో అనధికారికంగా ఫ్లెక్సీలు వేయవద్దని ముందే చెప్పానని.. అందువల్లే కార్పొరేషన్ సిబ్బంది తొలగిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. తన ఫ్లెక్సీలు కూడా వేసుకోవడంలేదని గుర్తుచేశారు. అయితే తాను సర్వేపల్లి నియోజకవర్గానికి వెళ్లడాన్ని సైతం తప్పు పడితే ఎలా అని ప్రశ్నించారు. తన బంధువుల సంవత్సరీకానికి సర్వేపల్లి వెళ్తే.. దానిని కూడా రాజకీయం చేస్తారా అంటూ మండిపడ్డారు. తానేమైనా అంటారానివాడినా.. ఎక్కడికీ పోకూడడా.. ఇదేం న్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: జగన్ ఫ్రస్టేషన్ కు కారణం అదే..? చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రెడీ? ఏడాది పాటు జనంలోనే
ఇదే సమయంలో నెల్లూరు రూరల్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy)ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)కలిశారు. మంత్రి అయ్యాక వరుసగా ఎమ్మెల్యేలని ఆయన కలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మొదట అనిల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేక వర్గం అనుకున్న వారందర్నీ కలిశారు. ఇప్పుడు అనిల్ కుమార్ ఇటీవల ఎవరెవరిని కలిశారో వారిని కలుస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ పరిధిలోని వెల్లటి గ్రామంలో గడప గడపకి జగన్ అన్న మాట శ్రీధర్ అన్న బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వెల్లంటి గ్రామంలోని రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటు మంత్రి కాకాని గడప గడపకి తిరిగారు.
ఇదీ చదవండి: జగన్ ఫ్రస్టేషన్ కు కారణం అదే..? చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రెడీ? ఏడాది పాటు జనంలోనే
ఈ సందర్భంగా కాకాని కీలక వ్యాఖ్యలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేను బాల్య స్నేహితులం.. ఒకే నెలలో పుట్టినా రోజులలో నేను పెద్దవాణ్ణి అని, అయితే రాజకీయాల్లో మాత్రం శ్రీధర్‌రెడ్డి నాకంటే పెద్ద అని కాకాని చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డికి తనను పరిచయం చేసిన వ్యక్తి శ్రీధర్‌రెడ్డి అని క్రెడిట్ ఆయనకే ఇచ్చే ప్రయత్నం చేశారు. కయ్యనికైనా వియ్యని కైనా సమఉజ్జీవులమేనని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, Nellore Dist, Ycp