మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanti Srinivas) పేరుతో 'ఐ లవ్ యూ బంగారం' అంటూ వైరల్ అవుతున్న ఆడియో (Audio Clip)పై ఆయన స్పందించారు. నా గొంతును ఎవరో మిమిక్రి చేసి ఫేక్ సంభాషణలు క్రియేట్ చేశారు. నా రాజకీయ భవిష్యత్తును, కీర్తి ప్రతిష్టలను నాశనం చేసేందుకే కొందరు ప్రయత్నిస్తున్నారని అవంతి శ్రీనివాస్ (Avanti Srinivas) ఆరోపించారు.నేను గత 15 రోజులుగా అయ్యప్ప దీక్షలోనే ఉన్నాను. ఈ ఆడియో (Audio Clip) వైరల్ పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాను అని ఆయన అన్నారు.
ఆ ఆడియో క్లిప్ (Audio Clip) తనది కాదని, దీనికి కారణమైన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanti Srinivas) తన పీఏతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఆడియో క్లిప్ (Audio Clip) సోషల్ మీడియాలో ముందుగా ఎవరు పోస్ట్ చేశారు. దీనికి కారణం ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆడియో క్లిప్ (Audio Clip) ల పోస్ట్ లను మొదట పోస్ట్ చేసింది ఎవరో అని ఆరా తీస్తున్నారు. కానీ నిందితులు ఎవరు అన్నది తెలుసుకోడానికి సమయం పడుతుందని పేర్కొన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు కూడా మాజీ మంత్రి ఆడియోను ప్రసారం చేశారు. దీనితో ఆ ఆడియో క్లిప్ విపరీతంగా వైరల్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Avanti srinivas