Perni Nani On Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఎన్నికల వేడి కనిపిస్తోంది. అన్ని పార్టీలు 2024 లో గెలుపే లక్షంగా అడుగులు వేస్తున్నాయి. ఇక టీడీపీ (TDP) మళ్లీ అధికారంలో రావాలనే లక్షంతో.. జనం బాట పట్టింది. అందులో భాగంగా నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuvagalam) పేరుతో పాదయాత్ర కూడా ప్రారంభించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా 400 రోజులు.. 4000 కిలోమీటర్లు ఆయన నవడనున్నారు. తొలి రోజు తన పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించారు.. ఈ పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ అధికార వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి,ఎమ్మెల్యే పేర్ని నాని (Ex Minister Perni nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భయం, బెరుకు లేకుండా లోకేష్ బరితెగించి అబద్ధాలు మాట్లాడాడని ఫైర్ అయ్యారు. బందర్ పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్‌ను టీడీపీ హయాంలో పూర్తి చేశారని, 5 ఏళ్ళల్లో 5 లక్షల ఉద్యోగాలను వాళ్ళ నాన్న ఇచ్చాడని, అమరావతిని పూర్తి చేయడంతో పాటు మోడీ మెడలు చంద్రబాబు వంచాడంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్పాడని మండిపడ్డారు.
లోకేష్ చెప్పినట్లు ఇవన్నీ చంద్రబాబు చేస్తే.. మరి ప్రజలెందుకు మిమ్మల్ని కైమా కైమా చేసి ఇంటికి పంపించారు అని పేర్ని నాని ప్రశ్నించారు. ఇక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు కూడా అందరికి గుర్తు ఉండే ఉంటాయి అన్నారు. చంద్రబాబు చెత్త నాయకుడని, ఎందుకు పనికి రాడని, అధికారంలోకి రాగానే కార్యకర్తలను పక్కన పెట్టేస్తాడని అచ్చెన్నాయుడే అన్నాడంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు అన్నారు.
పోలీసుల మధ్య బతికిన బతుకు చంద్రబాబు, లోకేష్‌ది అని పేర్ని నాని సెటైర్లు వేశారు. అసలు పోలీసుల లేకుండా వాళ్లిద్దరు అడుగు కూడా బయటకు పెట్టలేరని విమర్శించారు. నిజంగా దమ్ముంటే లోకేష్ ఎవరి సాయం లేకుండా బయటకు రావాలని సవాల్ విసిరారు. పోలీసుల సాయం తీసుకుంటారు.. మళ్లీ పోలీసుల్ని కించపరుస్తూ మాట్లాడడానికి వాళ్లకు సిగ్గు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : యువతకు ప్రత్యేక మానిఫెస్టో.. యువగళం తొలి రోజు లోకేష్ హామీ ఇదే..?
అలాగే చంద్రబాబుకు తన కొడుకు లోకేష్‌పై నమ్మకం లేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. కొడుకు పాదయాత్రకు సంబంధించిన పోస్టర్‌లో తండ్రి ఫోటో లేదని ఎద్దేవ చేశారు. చంద్రబాబు బతికి ఉండగానే ఆయన ఫోటో లేకుండా లోకేష్ రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇక చంద్రబాబుకు తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్‌పైనే ఎక్కువ నమ్మకం ఉందని.. అయితే ఆ దత్తపుత్రుడేమో బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు సైగ చేస్తుంటారని సెటైర్లు వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap minister perni nani, AP News, Nara Lokesh