Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. దీంతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP), జనసేన (Janasena) మధ్య అయితే మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. తాజాగా గుంటూరు జిల్లా (Guntur District) లోని ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చడం ఈ రెండు పార్టీల మధ్య మరింత రాజకీయ రాచ్చను పెంచింది. జనసేన (Janasena) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్వయంగా ఇప్పటం గ్రామం వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ (CM Jagan) పైనా..? వైసీపీ నేతలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఇలానే వ్యవహరిస్తే.. ఇడుపులపాయలో హైవే వేస్తానంటూ హెచ్చరించారు. గుంతలు పూడ్చ లేని.. రోడ్డు వేయలని వైసీపీ ప్రభుత్వం.. రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. కేవలం జనసేన సభకు స్థలం ఇచ్చారనే కక్షతో ఇళ్లను కూల్చివేస్తారా అంటూ మండిపడ్డారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు దీంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.
తాజాగా పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్ టూరిస్టులుగా తయారయ్యారన్నారు. ప్రజల తరపున పోరాడటానికి సమస్యలు ఏమి లేక తమ సొంత సమస్యలను ఎత్తి చూపుతూ ఇద్దరు నాయకులు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ మాదిరి, ఇప్పటంలో పవన్ కళ్యాణ్ కామెడీ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విమానం దిగి ఉరుకులు పరుగుల మీద ఇప్పటం వచ్చిన పవన్.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే అల్లరి చేశారని విమర్శించారు. 90 శాతం ఇప్పటం గ్రామస్తులు గ్రామ అభివృద్ధిని కోరుకుంటున్నారని కొడాలి నాని ఆరోపించారు. 600 ఇళ్లు ఉన్న గ్రామానికి 120 అడుగుల రోడ్లు ఎందుకుని ప్రశ్నిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకోవడమే ఆ ఇద్దరికి తెలిసిన విద్య అంటూ మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తులు తాగి న్యూసెన్స్ చేస్తే రెక్కిగా భావించి రాద్దాంతం చేశారని, రాజకీయంగా జగన్ ను ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఇదీ చదవండి : అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీలో ట్విస్ట్.. సినిమాలు.. సోషల్ మీడియా ప్రభావమేనా..?
గతంలో పవన్ విశాఖలో నానా హంగామా చేశారని, ఇప్పుడు ఇప్పటం వెళ్లి మరోసారి పవన్ హంగామా చేశారని కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుంటే టీడీపీకి నిద్రపట్టడం లేదన్నారు. మునుగోడులో కేఏ పాల్ పరుగులు పెట్టినట్లు ఇప్పటంలో పవన్ పరుగులు తీశారన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవన్నారు. లేని సమస్యలను పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సృష్టిస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Kodali Nani, Pawan kalyan, Ycp