Breaking News: మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) పార్టీ మారుతున్నారా..? డిసెంబర్ రెండవ వారంలోనే పార్టీ మారుతారని.. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని.. ప్రచారం జరిగింది. కానీ రెండో వారం దాటుతున్నా.. ఆయన పార్టీ మారలేదు. దీంతో అసలు గంటా పార్టీ మారుతున్నారా.. లేదా..? అంటూ ఆసక్తి నెలకొంది. అయితే దానిపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు.. గంటా ఏమన్నారంటే..? తన ప్రమేయం లేకుండానే పార్టీ మారుతాననే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నాకు తెలియకుండానే డేటు.. టైం కూడా ఫిక్స్ చేస్తారా అని ప్రశ్నించారు. ఎవరు ఏం రాసుకున్న.. ఏం ప్రచారం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. అవసరమైన సందర్భంలో తానే ఏం చెప్పాలో.. అది చెబుతాను అన్నారు.
అయితే గంటా క్లారిటీ ఇస్తారు అనుకుంటే మరింత కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు.. ఒకవేళ పార్టీ మారే ఉద్దేశం లేకపోతే పార్టీ మారడం లేదని చెబుతారు.. కానీ గంటా పార్టీ మారడం లేదని చెప్పలేదు. అదీ కాదు అంటే..? సొంత పార్టీని వీడది లేదని అయినా చెబుతారు.. కానీ గంటా ఆ మాట కూడా చెప్పలేదు.. అవసరమైన సమయంలో తానే చెబుతాను అన్నారు.. అంటే.. ఆయన ఏం చెప్పనున్నారు.. అనే కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు.
ఈ నెల 26న వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో జరగబోయే కాపునాడు మహాసభ పోస్టర్‌ను గంటా పలువురు కాపు నేతలతో కలిసి ఆవిష్కరించారు. కాపునాడు రీ ఆర్గనైజేషన్ ఒక ఆశయం కోసం పని చేస్తోందని, అదేంటో సరైన సమయంలో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా కాపులంతా హాజరవుతారన్నారు.
ఇదీ చదవండి : పవన్ సంచలన నిర్ణయం.. ఈసారి ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ.. ఎక్కడ నుంచో తెలుసా..!
గంటా అనుచరులు చెబుతున్నదాని ప్రకారం ఆయన పార్టీ మార్పుపై చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే అంటున్నారు. అయితే ఆయన వైసీపీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా తనతో పాటు ఇద్దరు ముగ్గుర్ని పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలన్నది తొలి డిమాండ్.. అయితే ఎంతమందిని అయినా పార్టీలో చేర్చుకోవడం వరకు ఒకే కానీ..? వారికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడమే డౌట్ అంటున్నాయి వైసీపీ వర్గాలు..
అంతేకాదు.. జిల్లాలో తనకు కీలక బాధ్యతలు అప్పగించాలని.. తనపై ఎవరి పెత్తనం లేకుండా ఉండాలని గంటా కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గంటా పెట్టిన డిమాండ్లు అంగీకరించడం సాధ్యం కాదని వైసీపీ చెప్పినట్టు సమాచారం.. అయితే మరి గంటా ప్రతిపాదనలకు పూర్తిగా ఆచరణ సాధ్యం కాదని.. అన్నింటిలో కొన్నిటికి ఒకే చెబితే గంటా మార్పు ఖాయమని.. విశాఖ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ganta srinivasa rao, Rishabh Pant, Visakhapatnam