అందరికీ ఇష్టమైన ఆ కమెండో ఇక లేరు.. గుండెపోటుతో సాయిక్రిష్ణారెడ్డి మృతి

సాయి క్రిష్ణారెడ్డి

Sai Krishna Reddy: రిటైర్మెంట్ అనంతరం శ్రీసాయి డిఫెన్స్ అకాడమీని స్థాపించి ఎంతో మంది యువతకు ఉచిత శిక్షణ ఇచ్చారు. యువతలో దేశభక్తిని నింపి.. తన అకాడమీలో శిక్షణ ఇచ్చి.. సైనికులుగా తయారుచేశారు.

  • Share this:
    భారత మాజీ సైనికుడు, శ్రీసాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సాయి క్రిష్ణారెడ్డి ఇకలేరు. గుండెపోటుతో మంగళవారం ఆయన హఠాన్మరణం చెందారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన సాయికృష్ణారెడ్డి.. హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. భారత సైన్యంలో బ్లాక్ కమెండోగా ఆయన పనిచేశారు. రిటైర్మెంట్ అనంతరం శ్రీసాయి డిఫెన్స్ అకాడమీని స్థాపించి ఎంతో మంది యువతకు ఉచిత శిక్షణ ఇచ్చారు. యువతలో దేశభక్తిని నింపి.. తన అకాడమీలో శిక్షణ ఇచ్చి.. సైనికులుగా తయారుచేశారు. అంతేకాదు ఆర్మీలో పనిచేస్తున్న సైనికులకు తన వంతు సహాయ సహకారాలు అందించారు. పేద కుటుంబాలకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆర్మీలో విధులు ఎలా ఉంటాయి? సైన్యంలో ఎలా చేరాలి? ఎలా ఉండాలి? అనే అంశాలపై విలువైన విషయాలను యూట్యూబ్ ఛానెల్ ద్వారా యువతతో పంచుకునేవారు. అలాంటి సాయిక్రిష్ణారెడ్డి మన మధ్య లేరన్న విషయం తెలిసి.. తెలుగు రాష్ట్రాలకు చెందిన సైనికులు, మాజీ జవాన్లు, ఆయన అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమకు ఎంతో ఇష్టమైన కమెండ ఇకలేరని తెలిసి కంటతడి పెడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: