Unstoppable 2: నందమూరి నటసింహ బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ ‘ఆహా’ (Aha) లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా రాజకీయంగానూ సంచలనం అవుతోంది. ఎందుకంటే రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) తో స్టార్ట్ చేసి సంచలనం సృష్టించారు. ఆ ఎపిసోడ్ లో ఎప్పుడూ స్పందించని అంశాలపై.. చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్ ను పార్టీ నుంచి గద్దె దించినప్పుడు ఏం జరిగింది అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే దీనిపై విమర్శలు కూడా ఆ స్థాయిలోనే కొనసాగాయి. తొలి ఎపిసొడ్ కు బంధువులు తీసుకొచ్చిన బాలయ్య.. ఇప్పుడు తన పాత స్నేహితులను పరిచయం చేస్తూ.. వారితో కలిసి సందడి చేశారు.. తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న 'అన్‌స్టాపబుల్' నాలుగో ఎపిసోడ్ గెస్ట్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy), ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి (Suresh Reddy) హాజరయ్యారు. ఇక ఈ షోలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులపై కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పారు అంటే..? ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ప్రస్తుతం అన్ని దగ్గర ఉండడం చాలా అవసరం అన్నారు. లీడర్స్ అంతా తప్పకుండా లెజిస్లేటివ్ క్యాపిటల్ లో, ఆఫీసర్స్ అంతా ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ లో ఉండాలి. అయితే కోర్ట్ లో ఏదైనా ఫైల్ చేయాలంటే.. ఆఫీసర్స్ కి మినిస్టర్స్ అండ్ సీఎం అనుమతి కావాల్సిందే. మనకి ఎప్పుడు కూడా అనుకూలత అనేది ముఖ్యం. కాబట్టి మూడు కలిసుంటేనే మంచిది” అంటూ కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
మరోవైపు క్రికెట్ తో ఉన్న అనుబంధం.. అజారుద్దీన్ తో ఉన్న స్నేహంపైనా కీలక విషయాలు పంచుకున్నారు. ఇండియన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ తో చాలాసాన్నిహిత్యం ఉందన్నారు. కాలేజీ సమయంలో అజర్, కిరణ్ కుమార్ కెప్టెన్సీలో అండర్-19 వంటి ఎన్నో మ్యాచ్ లు అడినట్టు చెప్పారు. ఆ తరువాతి కాలంలో కిరణ్ కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగా, అజహరుద్దీన్ ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. 1984లో ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ కి అజర్ సెలెక్ట్ అయ్యాక కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి సైకిల్ మీద వచ్చి.. కిరణ్ కుమార్ క్రికెట్ కిట్ ని తీసుకోని వెళ్ళాడట. ‘ఆ బ్యాట్‌తోనే అజహరుద్దీన్ మూడు సెంచరీలు చేసినట్లు’ ఈ షోలో చెప్పుకొచ్చారు.
అలా ఏపీ తెలంగాణలు విడీపోకూడదని తాను కోరుకున్నాను అన్నారు. ఎందుకంటే తెలుగు ప్రజల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. అవి పాడవ్వకుడదనే అలా తన అభిప్రాయం చెప్పాను అన్నారు. అప్పటికి 14 ఏళ్లుగా హైదరాబాద్ తో అనుబంధం ఉందని.. ఇప్పటికే హైదరాబాద్ లో ఉంటున్నానని.. అందుకే ఆ సంబంధం తెగిపోవడం తనకు ఇష్టం లేదన్నారు.. కానీ విభజన తరువాత తెలుగు రాష్ట్రాల ప్రజలు అంతా హ్యాపీగానే ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Three Capitals, Nallari Kiran Kumar Reddy, Unstoppable With NBK S2