హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

సుజనా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...రెండు రోజులుగా కొనసాగుతున్న సీబీఐ సోదాలు...

సుజనా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...రెండు రోజులుగా కొనసాగుతున్న సీబీఐ సోదాలు...

సుజనా చౌదరి

సుజనా చౌదరి

మొత్తం మూడు బ్యాంకుల నుంచి దాదాపు రూ.364 కోట్ల రుణాలు పొందినట్లు తెలుస్తోంది. తొలుత ఈడీ అధికారులు విచారణ చేసినప్పటికీ ప్రస్తుతం సీబీఐకి ఈ కేసును బదలాయించారు. బెంగుళూరుతో పాటు చెన్నై, హైదరాబాద్ లలో గడిచిన 28 గంటలుగా సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కంపెనీకి చెందిన నలుగురు డైరక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా చదవండి ...

    కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి కార్యాలయాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సోదాలు దాదాపు 28 గంటలు దాటినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాల ఎగవేతకు సంబంధించిన ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాబ్యాంకు, సెంట్రల్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని ఎగ్గొట్టారని బ్యాంకు అధికారుల నుంచి ఫిర్యాదు పొందిన సీబీఐ సుజానా సంస్థల్లో సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం మూడు బ్యాంకుల నుంచి దాదాపు రూ.364 కోట్ల రుణాలు పొందినట్లు తెలుస్తోంది. తొలుత ఈడీ అధికారులు విచారణ చేసినప్పటికీ ప్రస్తుతం సీబీఐకి ఈ కేసును బదలాయించారు. ఈ నేపథ్యంలోనే సుజానా చౌదరి బెంగుళూరులోని సీబీఐ కార్యాలయంలో మే 27న విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. బెంగుళూరుతో పాటు చెన్నై, హైదరాబాద్ లలో గడిచిన 28 గంటలుగా సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కంపెనీకి చెందిన నలుగురు డైరక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే సీబీఐ అధికారులు పలు కీలక పత్రాలతో పాటు, హార్డ్ డిస్కులను సైతం స్వాధీనం చేసుకున్నారు.

    First published:

    Tags: CBI, Sujana Chowdary

    ఉత్తమ కథలు