JD Laxminarayana: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణ కనిపిస్తోంది. ఎవరికి వారు 2024 ఎన్నికలే టార్గెట గా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వైసీపీ (YCP) ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై వ్యూహాల్లో దూకుడు చూపిస్తోంది. ఇటు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ (TDP) సైతం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతోంది. జనసేన (Janasena) తో కలిసి పోటీ చేేసే దిశగా పావులు కదుపుతోంది. జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ (BJP) అంటోంది. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో జేడీ లక్ష్మీ నారాయణ (JD Laxminarayana) మళ్లీ పోటీ చేస్తారా..? చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఆయనకు అసలు పోటీ చేసే ఉద్దేశం ఉందా లేదా అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఆ ప్రశ్నలకు జేడీ లక్ష్మీ నారాయణ క్లారిటీ ఇచ్చారు. తాను ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు, వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. అందరికీ మేలు చేసేందుకే హైదరాబాద్ లో కొందరు కాపు నాయకులతో సమావేశం అయ్యాను అన్నారు. కాపులకు రాజ్యధికారం కోసం కాపు నాయకులతో సమావేశమైనట్లు కలరింగ్ ఇచ్చారని విమర్శించారు. తాను ప్రజలకు అధికారం రావాలని కోరుకుంటానని అన్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయన అభిప్రాయం తెలిపారు. జిల్లాలను పెంచడం వల్ల ప్రజలకు పాలన దగ్గర అవుతుందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి అంశాన్ని ఫైల్ లలో రాస్తే అధికారులు కోర్టులకు వెళ్లాల్సినవసరం లేదని, ఫైళ్లు కోర్టుకు పెంపితే సరిపోతుందన్నారు.
ఇదీ చదవండి : భద్రాది రామయ్యకు గోటి తలంబ్రాలు రెడీ.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?
అయితే ఆయన స్వతంత్య్రంగా పోటీ చేస్తారా..? లేకా ఏదైనా పార్టీ లో చేరి పోటీ చేస్తారా అన్నదిపై క్లారిటీ ఇవ్వలేదు.. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో జనసేన సైతం ఘోరంగా ఓడిపోయింది. పోటీ చేసిన రెండు చోట్ల పవన్ పరాజయం చెందారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి లక్ష్మీనారాయణ.. జనసేనకు దూరంగా ఉంటున్నారు.
ఇదీ చదవండి :వైసీపీ ప్రొడెక్షన్ సమర్పించు.. జనం చెవిలో పువ్వు.. వైరల్ అవుతున్న వీడియో
అయితే ఆయన ఆప్ లో చేరుతారని ఓ ప్రచారం ఉంది. కాపు నేతలంతా కలిసి ప్రారంభించాలి అనుకునే పార్టీలో చేరుతారా అని మరో వర్గం అంటోంది. అయితే ఆయన సన్నిహితులు మాత్రం.. జేడీ కొత్త పార్టీలో చేరే ప్రసక్తే లేదని.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, JD Lakshmi Narayana