గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మాజీ సైనికుడు తుపాకీతో రెచ్చిపోయాడు. కాల్పులు జరిపి ఇద్దరు రైతులను పొట్టన బెట్టుకున్నాడు. మరో వ్యక్తికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాచర్ల మండలం రాయవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి రాయవరం గ్రామంలో పొలం వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. గ్రామ పెద్దలు ఎంత చెప్పినా వినలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అని.. పరస్పరం కొట్టుకున్నారు. ఈ క్రమంలో మాజీ సైనికుడు మట్టా సాంబశివరావు రెచ్చిపోయాడు. తుపాకీతో ప్రత్యర్థులపై ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మట్టా శివ, మట్టా బాలకృష్ణ, ఆంజనేయులు తల, ఇతర శరీర భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. శివ, బాలకృష్ణ అక్కడికక్కడే మరణించగా..ఆంజనేయులుకు తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. అతడిని హుటాహుటిన మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏపీలో మహిళా ఎస్ఐ ఆత్మహత్య.. శనివారమే శిక్షణ పూర్తి..అసలేమైంది?
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సాంబశివరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రాయవరం గ్రామం ఉలిక్కిపడింది. కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇక మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారిని అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని రోదిస్తున్నారు. ఐతే సాంబశివరావుకు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి లైసెన్స్ ఉందా? లేదంటే చట్ట విరుద్ధంగా వాడుతతున్నాడా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు మృతుల కుటుంబాలను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Shooting