జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జి.. నేరుగా సబ్ జైలుకు..

కోవిడ్ టెస్ట్ చేశాక, రిపోర్ట్ వచ్చిన తరువాత మాత్రమే డిశ్చార్జ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: July 1, 2020, 10:49 PM IST
జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జి.. నేరుగా సబ్ జైలుకు..
అచ్చెన్నాయుడు (File)
  • Share this:
ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్య మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. దాంతో ఏసీబీ అధికారులు ఆయన్ను నేరుగా సబ్‌జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు. ఐతే కోవిడ్ టెస్ట్ చేశాక, రిపోర్ట్ వచ్చిన తరువాత మాత్రమే డిశ్చార్జ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మరోవైపు అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ప్రస్తుతం అచ్చెనాయుడి ఆరోగ్యం బాగాలేదన ఆయన తరపు లాయర్ వాదించారు. కోర్టులో ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతారని చెప్పారు. ఐతే తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ఏసీీబీ కోర్టు.. ఈ నెల 3న తమ నిర్ణయాన్ని వెల్లడించనుంది.

కాగా, ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్నాయుడు సొంత ఇంటిలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం గుంటూరు తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే అచ్చెన్నాయుడుకు అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోనే ఆయన్ను విచారించింది ఏసీబీ. ఇప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడంతో సబ్ జైలుకు తరలించారు.
First published: July 1, 2020, 6:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading