హోమ్ /వార్తలు /andhra-pradesh /

Crazy App: ఈ యాప్ లో రీల్స్ చేస్తూ డ‌బ్బులు సంపాదించొచ్చు.. క‌ర్నూలు యువ‌కుడి క్రేజీ ఐడియా

Crazy App: ఈ యాప్ లో రీల్స్ చేస్తూ డ‌బ్బులు సంపాదించొచ్చు.. క‌ర్నూలు యువ‌కుడి క్రేజీ ఐడియా

సోషల్ మీడియా (Social Media) లో తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపుతుంటారు. అలాంటి వారి కోసం టిక్ టాక్ (Tik Tok), ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ (Insta Reels), ఫేస్ బుక్ రీల్స్ (Facebook Reels) ఏ స్థాయిలో యువ‌త‌ను ఆక‌ట్టుకుంటున్నాయో అంద‌రికి తెలిసిందే.

సోషల్ మీడియా (Social Media) లో తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపుతుంటారు. అలాంటి వారి కోసం టిక్ టాక్ (Tik Tok), ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ (Insta Reels), ఫేస్ బుక్ రీల్స్ (Facebook Reels) ఏ స్థాయిలో యువ‌త‌ను ఆక‌ట్టుకుంటున్నాయో అంద‌రికి తెలిసిందే.

సోషల్ మీడియా (Social Media) లో తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపుతుంటారు. అలాంటి వారి కోసం టిక్ టాక్ (Tik Tok), ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ (Insta Reels), ఫేస్ బుక్ రీల్స్ (Facebook Reels) ఏ స్థాయిలో యువ‌త‌ను ఆక‌ట్టుకుంటున్నాయో అంద‌రికి తెలిసిందే.

ఇంకా చదవండి ...

    సోషల్ మీడియా (Social Media) లో తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపుతుంటారు. అలాంటి వారి కోసం టిక్ టాక్ (Tik Tok), ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ (Insta Reels), ఫేస్ బుక్ రీల్స్ (Facebook Reels) ఏ స్థాయిలో యువ‌త‌ను ఆక‌ట్టుకుంటున్నాయో అంద‌రికి తెలిసిందే. స‌గం కంటే ఎక్కువ మంది యువ‌తే ఇన్ స్టాలో రీల్స్, ఫేస్ బుక్ లో రీల్స్ చేస్తూ చాలా వ‌ర‌కు త‌మ స‌మ‌యాన్ని గ‌డుపుతూ ఉంటారు. అయితే ఈ రీల్స్ ను జ‌స్ట్ స‌ర‌దా కోస‌మే అనుకోలేదు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని క‌ర్నూలు (Kurnool) కు చెందిన యువ‌కుడు సునీల్. రీల్స్ చేస్తోన్న యువ‌తు డ‌బ్బులు వ‌స్తే ఎలా ఉంటుంది అనే ఆలోచ‌న‌తో ఒక వినూత్న యాప్ తో ముందుకొచ్చాడు. రీల్స్ చేస్తూనే డ‌బ్బులు సంపాధించే విధంగా యాప్ ను రూపోందించాడు ఈ యువ‌కుడు.

    తాను రూపొందించిన యాప్ కు టాటా స్టార్ప్ ఫండింగ్ వాళ్లు కూడా అభినంద‌న‌లు కూడా అందుకున్నాడు. కర్నూలులోని సీతారాంనగర్ కు చెందిన సునీల్. ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా కొత్తగా చేయాలనే ఆసక్తితో ఇంజినీరింగ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులో జాయిన్ అయ్యాడు. అప్పుడు వ‌చ్చిన ఆలోచ‌నే ఈ యాప్. దేశంలో సగానికిపైగా యువ‌త వాడుతున్న రీల్స్ యాప్ నుంచే డ‌బ్బులు వ‌స్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌తో మొద‌ల‌పెట్టి సెల్ఫీ రైడ్ అనే స‌రికొత్త యాప్ ను రూపొందించాడు.

    ఇది చదవండి: పులిని పెంచుకుంటున్న యువకుడు.. చిరు సినిమానే స్ఫూర్తి.. ఉక్రెయిన్ లో తెలుగు యూట్యూబర్

    కంపెనీ ఐడియా: ఇంజినీరింగ్ చదువుతున్నపుడు కోడింగ్ అండ్ టెక్నాలజీ వైపు మరింత ఆశక్తి పెరిగిందని.., అందువలన ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న సమయంలోనే టెక్నాలజీ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నట్లు సునీల్ తెలిపాడు.

    జాబ్ ట్రయల్స్ అండ్ ప్రీపేరింగ్ కంపెనీ వర్క్ గురించి సునీల్ మాట్లూడుతూ..’జాబ్ చేయాలనీ నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కానీ కొంత కాలం జాబ్ చేసిన తర్వాత కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. అప్పుడు ఇంటర్వూస్ కోసం బెంగుళూరు వెళ్ళాను అక్కడ ఇంటర్నెట్ పవర్ మరియు సోషల్ మీడియా గ్రోత్ గురించి కొన్ని ఆర్టికల్స్ చదివాను. అప్పుడు నేను సోషల్ నెట్వర్కింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. అప్పటి నుండి ఫీచర్స్ మరియు డిసైజైనింగ్ కొత్తగ చేయాలనీ ఆలోచిస్తూ వుండేవాడిని. జాబ్ మీద పెద్దగా ఆసక్తి లేకపోయడంతో ఇంటర్వూస్ లలో సెలెక్ట్ కాలేదు. తర్వాత స్వంతగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ మని సంపాదించాను. ఆ తర్వాత కంపెనీ కోసం పని చేస్తూ వుండేవాడిని’ అని చెప్పాడు.

    ఇది చదవంది: ఏపీకి పొంచిఉన్న వానగండం..? మార్చిలో తుఫాన్లు వస్తాయా..? నిపుణలేమంటున్నారంటే..!

    కంపెనీ స్టార్ట్ చేయడం: సోషల్ నెట్వర్కింగ్ కంపెనీ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే అప్పటికే ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ లాంటి పెద్ద కంపెనీస్ వున్నాయి. వాటికి ధీటుగా పోటీ ఇవ్వాలంటే డిఫరెంట్ యూనిక్ ఫీచర్స్ మరియు స్ట్రాంగ్ రెవిన్యూ మోడల్ ఉండాలి. నాకు కంపెనీ పట్ల వున్నా విజన్, పాషన్ మరియు డెడికేషన్ తో టాప్ సోషల్ నెట్ వర్క్ కంపెనీస్ కి ధీటుగా, మరి ఏ కంపెనీల్లో లేని యూజర్ ఎక్సయిటింగ్ ఫీచర్స్ ని డిజైన్ చేశాను. తర్వాత కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం అందుకోసం సెర్చ్ చేసి, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ మెయిల్ చేశాను. వాళ్లలో రతన్ టాటా క్యాపిటల్(ఆర్.ఎన్. టి క్యాపిటల్), ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ చెన్నై ఏంజెల్ నెట్వర్క్ వాళ్ళు నా ప్రాజెక్ట్ అభినందించారు, ఇనిషల్ గా మీరే కంపెనీ స్టార్ట్ చేసి కొంత ట్రాక్షన్ వచ్చాక మళ్ళి మాకు తెలియజేయండి అని చెప్పారు. అందుకు నా దగ్గర వున్న కొంత డ‌బ్బులు, మా బావ దగ్గర కొంత డ‌బ్బు తీసుకొని నేనే కంపెనీ స్టార్ట్ చేసాను. కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి ఐదుగురు డెవలప్మెంట్ టీం తో కంపెనీ స్టార్ట్ చేశాను. సెల్ఫీ రైడ్ గురించి: సెల్ఫీ రైడ్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో వుంది. త్వరలోనే ఐఓఎస్ యూజర్స్ కి కూడా అందుబాటులోకి తెస్తాము. ప్రస్తుతం 65 వేలు డౌన్లోడ్స్ మరియు 4.6 రేటింగ్స్ వుంది. ఇందులో రీల్స్ చేస్తూ అప్ లోడ్ చేస్తే కంపెనీ మీకు కొంత డ‌బ్బును పే చేస్తోంది. దీంతో మీ స‌ర‌దాతోపాటు కాస్త డ‌బ్బులు కూడా సంపాధించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు యాప్ సృష్టిక‌ర్త సునీల్.

    First published: