• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ENFORCEMENT DIRECTORATE FILES CASE AGAINST EXTDP MLA YARAPATHINENI SRINIVASA RAO PRN

Andhra Pradesh: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఈడీ ఉచ్చు.., ఆయన జైలుకు వెళ్లక తప్పదా..?

Andhra Pradesh: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఈడీ ఉచ్చు.., ఆయన జైలుకు వెళ్లక తప్పదా..?

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గుంటూరు జిల్లా ( Guntur district) గురజాల టీడీపీ (Telugu Desham party) మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivas) పై ఈడీ (Enforcement directorate) ఉచ్చు బిగిస్తోంది. ఆయనపై ఈడీ కేసులు నమోదు చేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. అక్రమ మైనింగ్ వ్యవహారంలోమనీలాండరింగ్ చట్టం కింద యరపతినేనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. అక్రమంగా మైనింగ్ చేసిన సున్నపురాయికి సంబంధించి ఆర్ధిక లావాదేవీలపై దృష్టి పెట్టిన ఈడీ.. విదేశాల నుంచి డబ్బు వచ్చినట్లు అనుమానిస్తోంది. ఇటీవల హైదరాబాద్, గుంటూరు సహా 25 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. సున్నపురాయి అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ మొత్తం 17 కేసులు నమోదు చేసింది. వీటి ఆధారంగానే ఈడీ కూడా అభియోగాలు నమోదు చేసేందుకు సిద్ధమైంది.

    మరోవైపు అక్రమమైనింగ్ కు సంబందించి సీబీఐ గతేడాది ఆగస్టులో 17 మందిపై కేసులు నమోదు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ రిపోర్టులో నిందితులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ కు పాల్పడటంతో పాటు క్వారీలను విస్తరించుకుంటూ వెళ్లడం, సున్నపురాయిని రవాణా చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి, కేశనపల్లి, పిడుగురాళ్ల మండలలో కోణంకి గ్రామాల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఏళ్ల తరబడి సాగిన అక్రమ మైనింగ్ తో ప్రభుత్వానికి, ఇతర లీజుదారులకు కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడటంతో పాటు సహజ వనరులు కూడా దెబ్బతిన్నట్లు సీబీఐ ఆరోపించింది.

    Yarapathineni Srinivasa Rao, TDP, Illegal Mining, limestone, Guntur District, Enforcement Directorate, CBI, యరపతినేని శ్రీనివాస్, అక్రమమైనింగ్, టీడీపీ, సున్నపురాయి మైనింగ్, ఈడీ, సీబీఐ
    యరపతినేని శ్రీనివాసరావు (ట్విట్టర్)


    2014-2018 మధ్య కాలంలో జరిగిన సున్నపురాయి మైనింగ్, అలాగే లక్షల టన్నుల ఖనిజాన్ని తరలించడంపైనే ఈడీ దృష్టి సారించింది. ఆంద్రప్రదేశ్ ఖనిజ రాయితీ నిబంధనలను అనుసరించి దొంగతనం, దోపిడీ, నేరపూరిత దురాక్రమణ, మోసం కింద సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈడీ అయితే ప్రివెన్షన్ ఆప్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. మైనింగ్ కు సంబంధించిన నగదు లావాదేవీలపై దృష్టి పెట్టింది. సున్నపురాయిని ఎక్కడికి తరలించారు. ఖనిజం అమ్మకానికి సంబంధించి సొమ్ములు ఎలా వచ్చాయి.

    సీబీఐ పేర్కొన్న నిందితుల్లో యరపతి నేని అనుచరులు ఉన్నారు. వీరిలో నెల్లూరి శ్రీనివాసరావు (కేశానుపల్లి), వేముల శ్రీనివాసరావు (నారాయణపురం, నడికుడి), ఓర్సు వెంకటేశ్వరరావు (నడికుడి), వేముల ఏడుకొండలు (నారాయణపురం, నడికుడి), ఇర్ల వెంకటరావు (నారాయణపురం, నడికుడి), బత్తుల నరసింహారావు (దాచేపల్లి), మీనిగ అంజిబాబు (జనపాడు), గ్రంధి అజయ్‌కుమార్‌ (పిడుగురాళ్ల), జి.వెంకట శివకోటేశ్వరరావు (పిడుగురాళ్ల), ఓర్సు ప్రకాశ్‌ (కొండమోడు–రాజుపాలెం), వర్ల రత్నం (పిడుగురాళ్ల), నంద్యాల నాగరాజు (కొండమోడు–రాజుపాలెం), ఆలపాటి నాగేశ్వరరావు (ధరణికోట–అమరావతి) సహా మరో నలుగురు కేసులో నిందితులుగా ఉన్నారు.

    అధికారంలో ఉన్న సమయంలో యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కు పాల్పడి వందల కోట్లు దోచుకున్నారని వైసీపీ నేతలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఓటమి పాలైన తర్వాత యరపతినేని పై సీబీఐ, ఈడీ కేసులు నమోదుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు