Home /News /andhra-pradesh /

ENFORCEMENT DIRECTORATE DIRECTORATE ATTACHES RS 4109 CRORE AGRI GOLD ASSETS BA

Agri Gold: అగ్రిగోల్డ్‌ ఆస్తులపై ఈడీ కీలక నిర్ణయం..

Agri Gold: అగ్రిగోల్డ్ లోగో

Agri Gold: అగ్రిగోల్డ్ లోగో

అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలోని అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసింది.

    Agri Gold Scam: అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలోని అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసింది. ఏపీలో విజయవాడ - గుంటూరు మధ్య ఉన్న 56 ఎకరాల హాయ్ లాండ్ ఆస్తులు కూడా ఎటాచ్ చేసింది. అలాగే, పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలు అటాచ్ చేసింది. అగ్రిగోల్డ్ పై దర్యాప్తు కొనసాగుతోంని ఈడీ ప్రకటించింది. మరోవైపు అగ్రిగోల్డ్ నిందితులను పది రోజుల ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఈడీ కోర్టు తీర్పు చెప్పింది. డిసెంబర్ 27 నుంచి జనవరి 5వరకు కస్టడీలో ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావును ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అలాగే, ప్రమోటర్లు ఏవీ శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్ ను కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

    ఇవి కూడా చదవండి

    యూకేలో వచ్చిన కొత్త కరోనా వైరస్ లక్షణాలు

    తక్కువ ధరకే సొంతిల్లు కొనుక్కోవడం ఎలా? 3 చిట్కాలు

    అగ్రిగోల్డ్ స్కామ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పీడ్ పెంచారు. మనీ ల్యాండరింగ్ కేసులో అగ్రి గోల్డ్ సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్లంతా కలిసి రూ. 6,400 కోట్లు స్కామ్‌కు పాల్పడినట్లు ఈడీ అధికారులు తేల్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో డిపాజిటర్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం అడ్డంగా ముంచింది. అలా వచ్చిన సొమ్ముతో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటికే చైర్మన్‌తో పాటు ఇద్దరు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ స్కామ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంట్లో పెట్టుబడి పెట్టి ఎంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది అయితే నష్టపోయామనే మనస్తాపంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయితే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ నాటి ఉమ్మడి హైకోర్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని సూచించింది.

    ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..

    TATA Cars offers: డిసెంబర్‌లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు 

    తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. డిపాజిట్ దారులకు డబ్బు చెల్లించాలని హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే డబ్బులు చెల్లిస్తారని ఈ కేసును విచారించిన సీఐడీ ప్రకటించింది. అగ్రి గోల్డ్‌లో రూ. 10వేలు డిపాజిట్ చేసిన వారు సుమారు 3,59,655 మంది ఉంటారని సీఐడీ నివేదికలో ఉంది. అగ్రిగోల్డ్‌పై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే కొంత మంది డిపాజిట్ దారులకు డిపాజిట్లను చెల్లించారు. రెండో విడతలో ఇతర డిపాజిట్ దారులకు డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ. 1150 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించడం కోసం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వం ఇప్పటికే రూ.10వేలు అంతకంటే తక్కువ డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Agri Gold, Andhra Pradesh, Enforcement Directorate

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు