EMPLOYEES SLAMS AP GOVERNMENT FOR WITHDRAWING GPF AMOUNT FROM THEIR ACCOUNTS FULL DETAILS HERE PRN GNT
AP News: ఏపీలో మరోసారి ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం.. జీపీఎఫ్ ఖాతాలపై గందరగోళం
ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh)2018-19వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జీతాలకు సంబంధించి జీపీఎఫ్ ఖాతాల నుంచి డీఏ ఎరియర్స్ క్రెడిట్ అయిన విషయంలో గందరగోళం నెలకొని ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh)2018-19వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జీతాలకు సంబంధించి జీపీఎఫ్ ఖాతాల నుంచి డీఏ ఎరియర్స్ క్రెడిట్ అయిన విషయంలో గందరగోళం నెలకొని ఉంది. బిల్లులు పాస్ చేయకుండానే డబ్బులు క్రెడిట్ కావడంతో ఉద్యోగ సంఘం నేతలు ఆర్థికశాఖ అధికారుల వద్ద ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి రూ.800 కోట్లు మాయం అయ్యాయని ఆరోపించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా, వారు దాచుకున్న సొమ్ములు కూడా మాయం కావడం ఏపీలో తప్ప ఎక్కడ జరగదని ఆరోపించారు. సాధారణంగా జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకున్నప్పుడు సంబంధిత ఉద్యోగులకు ఎస్ఎంఎస్ వస్తుంది. కానీ, ఏ ఒక్కరికీ ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం లేదు.
గుట్టుచప్పుడు కాకుండా జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ. 800 కోట్లను ప్రభుత్వం డ్రా చేసుకుంది. ఆ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఉద్యోగ సంఘం నేతలు ఆ నిధులను సంరక్షకునిగా ఉండాల్సిన అకౌంటెంట్ జనరల్ (ఏజీ)ని నిలదీస్తున్నారు. అక్రమంగా డ్రా చేసిన నిధులకు బాధ్యునిగా ఆయనపై కేసు పెట్టాలని ఏపీ ఉద్యోగ సంఘాలు సిద్ధం కావడం విశేషం.
మొత్తం 90,000 మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి అనధికార పద్ధతిలో ₹800 కోట్లు విత్డ్రా చేశారని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ ఆరోపించారు. “GPF నిధుల సంరక్షకుడిగా ఉన్న అకౌంటెంట్ జనరల్ (AG), అక్రమ ఉపసంహరణలను ఎలా అనుమతించగలరు అంటూ ఆయన ప్రశ్నించారు. సోమవారం రాత్రి జీపీఎఫ్ ఖాతాల వార్షిక స్టేట్మెంట్లను ఏజీ అప్లోడ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఉద్యోగులు మంగళవారం వాటిని డౌన్లోడ్ చేసినప్పుడు షాక్ తిన్నారు. జీపీఎఫ్ సంరక్షకుడిగా ఉండాల్సిన ఏజీ తో పాటు అక్కడ పనిచేస్తోన్న సంబంధిత అధికారులు నిర్దిష్ట మొత్తాలను విత్డ్రా చేసినట్లు గుర్తించారు.తన సొంత జీపీఎఫ్ ఖాతా నుంచి ₹83,000 డ్రా చేసినట్లు సూర్యనారాయణ వెల్లడించారు. చాలా మంది ఉద్యోగులు సూర్యనారాయణ మాదిరిగా ఖంగుతిన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆర్థిక శాఖ మరియు CFMS సహా సంబంధిత శాఖలు ఇలాంటి నిధులు డ్రా చేయడంపై వివరణ ఇవ్వలేకపోతున్నారు.
ఈ వ్యవహారంపై టీడీపీ నేత అశోక్ బాబు మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో జరగని ఎకనామిక్ డిజార్డర్స్, ఫైనాన్షియల్ డిసార్టర్స్ ఏపీలో జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం బడ్జెటింగ్ లో, పబ్లిక్ కి ఫిగర్స్ చూపించడంలో తప్పులు చూపిస్తోందన్నారు. అప్పులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. జులై 2018, జనవరి 2019 డీఏ బకాయిలను ప్రభుత్వం గత యేడాది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమచేసి తేదీ మారకముందే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారని.., వేసి మళ్లీ తీసుకోవాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.