EMPLOYEES REJECTED TO MEET MINISTERS COMMITTEE OVER PRC DEMANDS TO WITHDRAWN GO FULL DETAILS HERE PRN
AP PRC Fight: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల మరో షాక్
వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
పీఆర్సీ (AP PRC Issue) విషయంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వార్ కొనసాగుతోంది. పీఆర్సీని వెనక్కి తీసుకునేదేలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా.. కొత్త పీఆర్సీని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
పీఆర్సీ (AP PRC Issue) విషయంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వార్ కొనసాగుతోంది. పీఆర్సీని వెనక్కి తీసుకునేదేలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా.. కొత్త పీఆర్సీని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మెనోటీసులిచ్చిన ఉద్యోగులు.. తమ డిమాండ్ల విషయంలో తగ్గేదేలేదని భీష్మించుకొని కూర్చున్నారు. మరోవైపు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీతో చర్చించేందుకు కూడా ఉద్యోగులు విముఖత చూపిస్తున్నారు. ఇప్పటికే భేటీకి రావాల్సిందిగా మంత్రుల కమిటీ రెండుసార్లు ఆహ్వానించింది. కాని ఉద్యోగులు మాత్రం పీఆర్సీని రద్దు చేసేవరకు మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అని స్పష్టం చేస్తున్నారు.
తాజాగా మరోసారి ప్రభుత్వానికి షాకిచ్చేలా ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్న మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సచివాలయంలో భేటీకి రావాలని ఉద్యోగులను ఆహ్వానించారు. దీనిపై సమావేశమైన పీఆర్సీ సాధన సమితి సభ్యులు ప్రభుత్వానికి షాకిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. జీవోలు రద్దు చేసేవరకు చర్చలకు హాజరయ్యేది లేదని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. జీవోలు రద్దు చేయాలని కోరుతూ మంత్రుల సంఘానికి లేఖ రాయాలని తీర్మానించాయి. దీంతో పీఆర్సీ వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పలుచోట్ల భారీ ర్యాలీ చేపట్టారు. జీతాల విషయంలో ప్రభత్వం తమను మోసం చేసిందని.. న్యాయం చేసేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. చిత్తూరు, కడప, విజయవాడ, విసాఖపట్నం తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే పీఆర్సీపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాలు పెంచే అధికారం, అలాగే తగ్గించాలే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని తేల్చి చెప్పేసింది. అంతేకాదు. పీఆర్సీ పర్సంటేజ్లపై చాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని అభిప్రాయపడింది. ఎంత జీతం తగ్గిందో చెప్పండి అంటూ ప్రశ్నించింది. పూర్తి డేటా లేకుండా ఎలా పిటిషన్ వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించాలని హైకోర్టు సూచనలు చేసింది. ఉద్యోగులకు జీతాలు పెరిగాయని లెక్కలతో కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి లెక్కలతో కోర్టు తెలిపిన ఏజీ.. ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.