EMPLOYEES PUT THREE DEMANDS BEFORE MINSTER COMMITTEE ON PRC ISSUE IN ANDHRA PRADESH NGS
AP Employees Strike: ఆ మూడూ చేయండి. మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘాల డిమాండ్
మూడు డిమాండ్ల కోసం ఉద్యోగ సంఘాల పట్టు
AP Employees Committee: పీఆర్సీ ఫైట్ మరింత ముదురుతోంది. ప్రభుత్వం చర్చలు అంటోంది.. ఉద్యోగ సంఘాలు కుదరదంటున్నాయి. తము పెట్టిన మూడు కండిషన్లకు ఓకే చెబితేనే చర్చలకు వస్తామంటున్నారు.. ఇంతకీ ఆ డిమాండ్లు ఏంటి...?
AP Employees Strike: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పీఆర్సీ(AP PRC Issue) వివాదం అంతకంతకూ ముదురుతోంది. మొదట మంత్రుల కమిటీతో చర్చలకు వెల్లకూడదని నిర్ణయించుకున్న పీఆర్సీ సాధన కమిటీ.. తరువాత అనూహ్యం నిర్ణయం తీసుకుంది. తమ తరపున కొందరు ప్రతినిధులతో ఓ వినతి పత్రం పంపింది.. ఆ వినతి పత్రంలో మూడు డిమాండ్లను పెట్టింది.. వాటికి అంగీకారం తెలిపితేనే చర్చలకు వచ్చేది అని స్పష్టం చేసింది. అయితే ఇటే మంత్రులు మాత్రం.. చర్చకు రావాల్సిందే అని పట్టు పడుతున్నాయి.. వినతి పత్రాలు ఇచ్చి సమస్య పరిష్కరించమంటే ఎలా అని ప్రశ్నిస్తోంది. అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వచ్చి.. చర్చలు జరిపితే.. పీఆర్సీ విషయంలో ఉన్న సమస్యలను వివిస్తామని.. చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంద అని మంత్రులు చెబుతున్నారు.
ఇటు మంత్రులు చర్చలు అంటున్నారు.. అంటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిమాండ్లు నెరవేరాకే చర్చలు అంటున్నారు. దీంతో రెండో రోజు సమావేశాన్ని అలా ముగించారు.. అసలు తొలి రోజు సమావేశానికి అయితే ఉద్యోగ సంఘాలు అటు వైపు కూడా వెళ్లలేదు.. కానీ హైకోర్టు వ్యాఖ్యలు నేపథ్యంలో మనసు మార్చుకుని.. ప్రభుత్వంతో చర్చలకు డుమ్మా కొట్టారు అనిపించుకోకుండా.. వెళ్లి మంత్రులను కలిసి వినతి పత్రం ఇచ్చి వచ్చారు..
పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని ఉద్యోగా సంఘాల నేతలు కోరారని.. ఒక్కసారి జారీ చేసిన జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు సజ్జల. ఏదీ అడక్కుండానే ముఖ్యమంత్రి జగన్ అన్నీ ఇచ్చారని చెప్పారు. ఇంతకాలం చేసిన ప్రక్రియను తిరగతోడటం సరికాదని ప్రభుత్వం అప్పీల్ చేస్తోందన్నారు. ఏవైనా మార్పులు గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సజ్జల స్పష్టం చేశారు. మళ్లీ 27వ తేదీన చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరామని సజ్జల తెలిపారు.
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అని.. వారి సమస్యల పరిష్కారం ప్రభుత్వం బాధ్యత అంటున్నారు. పీఆర్సీ అన్నది ఎప్పుడైనా ఇవ్వాలని.. అయితే చర్చలు జరిగితేనే కదా ముందడుగు పడుతుంది అంటున్నారు. తరువాత సమావేశానికి కచ్చితంగా ఉద్యోగ సంఘాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి.. ఉద్యమ కార్యచరణలో భాగంగా.. అన్ని జిల్లాల కేంద్రాల్లో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పలుచోట్ల భారీ ర్యాలీ చేపట్టారు. జీతాల విషయంలో ప్రభత్వం తమను మోసం చేసిందని.. న్యాయం చేసేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. చిత్తూరు, కడప, విజయవాడ, విసాఖపట్నం తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.