Home /News /andhra-pradesh /

EMPLOYEES EXPRESS DISSATISFACTION ON GOVERNMENT OVER THEIR PRC AND OTHER DEMANDS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

AP Govt Employees: మరింత ముదురుతున్న పీఆర్సీ ఫైట్.. సీఎంతోనే తేల్చుకుంటామన్న ఉద్యోగులు.. తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఫైర్..

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ (AP Government Employees) విషయం మరింత ముదురుతోంది. దాదాపు నెల రోజులుగా పీఆర్సీపై సమావేశాలు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్ధికశాఖ అధికారులతో సీఎం పలుసార్లు చర్చలు జరిపినా ఇంతవరకు స్పష్టత రాలేదు.

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ (AP Government Employees) విషయం మరింత ముదురుతోంది. దాదాపు నెల రోజులుగా పీఆర్సీపై సమావేశాలు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్ధికశాఖ అధికారులతో సీఎం పలుసార్లు చర్చలు జరిపినా ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు గురువారం మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యాయి. ఐతే ఈ సమావేశంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. పీఆర్సీపై సీఎం జగన్ తోనే తేల్చుకుంటామని స్పష్టం చేశాయి. తాము ఇచ్చిన 71 డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. అధికారులు చెప్పిన నివేదికలో ఉన్న 14.29 శాతం ఫిట్ మెంట్ కు తాము సానుకూలంగా లేవని స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదిక విషయంలో కాస్త వెనక్కి తగ్గినా.. ప్రభుత్వం మాత్రం సరిగా స్పందించడం లేదన్నారు.

  ప్రస్తుతం తీసుకుంటున్న 27శాతం ఐఆర్ మీద ఎంత ఫిట్ మెంట్ ఇస్తారో నిర్ణయించిన తర్వాతో తమను చర్చకు పిలవాలని చెప్పారు. సీఎం దగ్గరకి తీసుకెళ్తామని సీఎస్ చెప్పినా.. హామీని నిలబెట్టుకోలేదు. జనవరి 3వ తేదీ నుంచి ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ సమావేశమైన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

  ఇది చదవండి: ఏపీలో జనవరి 1నుంచి పెరగనున్న వాహనాల లైఫ్ ట్యాక్స్.. ఏ వాహనానికి ఎంతంటే..!


  ఆర్ధిక శాఖ కార్యదర్శితో జరిగిన సమావేశానికి 9 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉన్న ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి. ఉద్యోగులను అవమానించడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప.. తమ డిమాండ్లను పరిష్కరించడం లేదని అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంటేశ్వర్లు విమర్శించారు. గతంలో ఉన్న సాంప్రదాయాలకు ప్రభుత్వం తిలోదకాలిస్తోందని మండిపడ్డారు. సీఎస్, సలహాదారు సజ్జలతో చర్చలు అయిపోయి సీఎం దగ్గరకు వెళ్తారనుకునే సందర్భంలో మరోసారి ఆర్ధిక శాఖతో చర్చలు జరపడానికి పిలిచారంటే ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో రూ.75వేల కోట్లు ఉద్యోగులకే ఖర్చు పెడుతున్నట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోందని అన్నారు.

  ఇది చదవండి: సీజ్ చేసిన సినిమా థియేటర్ల తెరిచేందుకు ప్రభుత్వం ఓకే.. ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తికి సరేనన్న మంత్రి


  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో తమకు తెలుసన్నారు. 2013 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారలేదని అందుకు తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంతా ఉద్యోగులకే ఖర్చు చేస్తున్నామని లెక్కలు చెప్పడం అబద్ధమన్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ సత్యదూరమేనన్నారు. ఆర్ధిక పరిస్థితి దిగజారితే ప్రభుత్వం ఎందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించిందని బొప్పరాజు ప్రశ్నించారు.

  ఇది చదవండి: ఏపీలో మాఫియా పెరిగిపోయింది.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు


  ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియామకాలు చేపడుతోందన్నారు. మేం అడిగిన లెక్కలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. ప్రభుత్వం కూడా తమ కుటుంబాల ఆర్ధిక పరిస్థితిని పట్టించుకోవాలన్నారు. తమకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామనే భావనలో ప్రభుత్వం ఉందని బొప్పరాజు విమర్శించారు. పీఆర్సీ విషయంలో పురోగతి ఉంటేనే చర్చలకు పిలవాలని.. లేకుంటే నేరుగా సీఎంతోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. పీఆర్సీతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అలాగే హెచ్ఆర్ఏ, సీసీఏ మొదలైన రాయితీల్లో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Employees

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు