హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodi Pandalu: కోస్తాలో కోడి పందాల జోష్ .. బాహుబలి రేంజ్‌లో బరులు ఏర్పాటు

Kodi Pandalu: కోస్తాలో కోడి పందాల జోష్ .. బాహుబలి రేంజ్‌లో బరులు ఏర్పాటు

COCK FIGHT

COCK FIGHT

Kodi Pandalu: కోస్తాలో కోడి పందాల జోష్ మొదలైంది. సంక్రాంతి పండుగ మూడ్రోజుల పాటు కోలాహలంగా జరిగే ఈపోటీలు గతంలో పంట పొలాల్లో బరులు సిద్దం చేసే వారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వెంచర్లలో బరులు సిద్దం చేయడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

(Anna Raghu,Sr.Correspondent,Amaravathi,News18)

సంక్రాంతి వచ్చిందంటే కోడి పందేల బరులు సిద్దం అయిపోతుంటాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా(Krishna),గుంటూరు (Gunturu)జిల్లాల్లోనూ కోడి పందాలు జో(Kodi Pandalu)రుగా సాగుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతల అండతో బరులు సిద్దం చేశారు. గతంలో పంట పొలాల్లో బరులు సిద్దం చేసే వారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వెంచర్లలో బరులు సిద్దం చేశారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలోని కంకిపాడు(Kankipadu),నిడమానూరు(Nidamanur),ఈడుపుగళ్లు, ఆకునూరు, ఉయ్యూరు, ముదినేపల్లిల్లో బరులు ఇప్పటికే సిద్దం చేశారు. ముందుగా ఎత్తుగా ఉన్న ఖాళీ స్థలాలను ఎంచుకుని బరి చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. షామియానాలు, కుర్చీలు, రాత్రిపూట పందాల కోసం లైటింగ్( Lighting)ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు పొలాలకు ఉండే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఉపయోగించుకుంటున్నారు. కరెంటు పోతే వెంటనే జనరేటర్ వేసే సౌకర్యం ఏర్పాటు చేసుకుంటున్నారు.

Andhra Pradesh: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ లాటరీ కేసు .. జనసేన ఫిర్యాదుతో కోర్టు తీర్పు

కోస్తాలో కోడి పందాల జోష్..

కోడి పందాల బరులు నిర్వహించే వారు గతంలో రహస్యంగా పందేలు ఆడేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మా బరి గురించి కొంచెం ప్రచారం చేయాలంటూ మీడియా వెంట పడుతున్నారు. అంటే పాలక పక్షం నుంచి పందేలు నిర్వహించే వారికి అన్ని అండదండలు అందాయని తెలుస్తోంది. అందుకే కోడి పందాళ్ల రాయుళ్లు బరి తెగించారనే ప్రచారం ఉంది.

భారీ ఏర్పాట్లు..

కోడి పందాలకు కత్తుల కట్టే వారిని పత్యేకంగా రప్పిస్తారు. ఈ విద్య తెలిసిన వారు అతి కొద్ది మంది మాత్రమే ఉండటంతో వారు రోజుకు రూ.25వేలు డిమాండ్ చేస్తున్నారు. అయినా నాలుగైదు రోజుల కోసం వారికి లక్ష చెల్లించి పందెం కోళ్లకు కత్తులు కట్టేందుకు తీసుకు వస్తున్నారు. కుడికాలు చివరి వేలుకు ముందుగా పలుచటి గుడ్డ చుట్టి దానిపై కత్తికట్టి తరవాత గట్టిగా కట్టేస్తారు. ఇలా బరిలోకి దిగిన కోడి పందెం 5 నుంచి 8 నిమిషాల్లో ముగుస్తుంది. ఒక్కోసారి ఒక్క వేటుకే కోడి కిందపడిపోతుంది.  కోడికి కట్టే కత్తుల తయారీ ఒక పరిశ్రమలా మారింది. వీటిని అతికొద్ది మంది మాత్రమే తయారు చేయగలరు. ముందుగా భారీ వాహనాలకు ఉపయోగించే బేరింగులు తీసుకుని దాన్ని కత్తిలా మారుస్తారు. కోడి కత్తికి 6 విధాలా పదును ఉండేలా తయారు చేస్తారు. ఇలా కత్తులు తయారు చేసే వారి సంఖ్య ఏటా తగ్గుతోంది. ఒక్కో కోడి కత్తి గతంలో రూ.200 ఉండేది నేడు కోడి కత్తి ధర రూ.500లకు పెరిగింది. అయినా పందెం రాయుళ్లు వెనక్కు తగ్గడం లేదు.

సంక్రాంతి సంబురాల్లో ఇదే కీలకం..

కోడిపందేలకు అదనంగా కోతముక్క, లోపల, బయట, పత్తాలు, మూడుముక్కలాటలు కూడా నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా కూడా బరి నిర్వాహకుడికి భారీగా ఆదాయం చేకూరుతుంది. అందుకే కోత ముక్క నిర్వహించే వారిని అనేక ప్రాంతాల నుంచి రప్పించారు. కోడి పందేల్లో పాల్గొనే వారు కుక్కట పురాణం ప్రకారం పందేలు వేస్తారు. ఒక్కో కోడికి ఒక్కో పేరు ఉంటుంది. కాకి, నెమలి, డేగ, ఆసిల్, చిలక ఇలా అనేక పేర్లు పెట్టుకుంటారు. రెండు సంవత్సరాల ముందు నుంచే పందెం కోళ్లను ప్రత్యేకంగా మేపడంతోపాటు, ప్రతి రోజూ ట్రైనింగ్ ఇస్తుంటారు. వీటి ధర పది వేల నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతుందంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.

First published:

Tags: Andhra pradesh news, Sankranti 2023

ఉత్తమ కథలు