హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Eluru Mistery Disease: ఏలూరులో వింత వ్యాధి కలకలం.. అస్వస్థతకు గురైన ఒకరు మృతి

Eluru Mistery Disease: ఏలూరులో వింత వ్యాధి కలకలం.. అస్వస్థతకు గురైన ఒకరు మృతి

ఆస్పత్రిలో బాధితును పరామర్శిస్తున్న మంత్రి ఆళ్ల నాని

ఆస్పత్రిలో బాధితును పరామర్శిస్తున్న మంత్రి ఆళ్ల నాని

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. శనివారం రాత్రి నుంచి మొదలుకుని ఇప్పటివరకు 270కి పైగా అస్వస్థకు గురై ఆస్పత్రుల్లో చేరారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. శనివారం రాత్రి నుంచి మొదలుకుని ఇప్పటివరకు 270కి పైగా అస్వస్థకు గురై ఆస్పత్రుల్లో చేరారు. వారిలో పలువురు కోలుకున్నారు. అయితే వింత వ్యాధితో అస్వస్థకు గురై ఈ రోజు ఉదయం ఆస్పత్రిలో చేరిన విద్యానగర్ వాసి శ్రీధర్ (45) చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శ్రీధర్ మృతిచెందాడని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నా వైద్యులు విజయవాడ తరలించలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు శ్రీధర్‌ మృతిని వైద్యులు ఇంకా ధ్రువీకరించలేదు.  ఇక, అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురికి మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాధితులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు చెప్పారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆరా తీశారు. బాధితులకు సత్వర వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో మంత్రి ఆళ్ల నాని బాధితులను పరామర్శించారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 227 కేసులు నమోదయ్యాయని నాని తెలిపారు. ఆసుపత్రి నుంచి ఇప్పటి వరకు 70 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. భాదితులకు అన్ని పరీక్షలు చేశామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఎవరికి ప్రాణాపాయం పరిస్థితి లేదని చెప్పారు. ప్రజలు, బాధిత కుటుంబాలు ఆందోళన చెందొద్దన్నారు. ఏలూరుకు నిపుణులు బృందాలు వచ్చాయని.. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి పై సమీక్షిస్తున్నామని చెప్పారు. నీటిలో కాలుష్యం లేదని నివేదిక వచ్చిందని వెల్లడించారు.

ఇలా మొదలైంది:

ముందుగా ఏలూరు వన్ టౌన్ లోని దక్షిణ వీధిలో కొంతమంది స్పృహతప్పి పడిపోయారు. ఆ తర్వాత శనివారపుపేట, ఆదివారపుపేట, అరుంధతిపేట, పడమరవీధి, కొత్తపేట, అశోక్ నగర్, తంగెళ్లమూడి, తాపీమేస్త్రీ కాలనీ, అరుంధతిపేట ప్రాంతాల్లోనూ పిల్లలు పడిపోసాగారు. ఒక్కసారిగా కలకలం రేగింది. అంతా ఆందోళన చెందారు. వెంటవెంటనే ఆంబులెన్సులు వచ్చి బాధితులను ఆస్పత్రులకు తరలించాయి. కొందరికి మూర్చ, కొందరికి వాంతులు, నోట్లోంచీ నురగ రావడం వంటి లక్షణాలు కనిపించినట్లు డాక్టర్లు తెలిపారు.

First published:

Tags: Alla Nani, AP News, Eluru, West Godavari

ఉత్తమ కథలు