ELURU MYSTERY DISEASE HISTORICALLY ELURU IS A GREAT CITY BUT ITS GLORY DAMAGED DUE TO MYSTERIOUS ILLNESS NK
Eluru Mystery Disease: వింతవ్యాధితో హాట్ టాపిక్ అయిన ఏలూరు. ఏం జరుగుతోంది?
వింతవ్యాధితో హాట్ టాపిక్ అయిన ఏలూరు. ఏం జరుగుతోంది? (image credit - twitter)
Eluru Mystery Disease: తరచుగా వార్తల్లోకి రాని ఏలూరు... ఇప్పుడు దేశమంతా చర్చించుకునేలా మారింది. వింత వ్యాధికి కారణం ఏంటన్నది ఇంకా తెలియకపోవడం ఆశ్చర్యకరమే.
Eluru Mystery Disease: ఎక్కడో చైనాలోని వుహాన్‌లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ని త్వరగానే గుర్తించగలిగారు కానీ... ఆంధ్రప్రదేశ్... పశ్చిమ గోదావరి జిల్లా... ఏలూరులో వచ్చిన వింత వ్యాధికి కారణం ఏంటన్నది మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. అందరూ ఒకేరకమైన కారణం చెబితే... అదే అసలైన కారణం అనుకోవచ్చు. కానీ... దీనిపై దర్యాప్తు జరిపిన సంస్థలు... రకరకాల కారణాలు చెబుతుంటే... ఏలూరు ప్రజలు ఏది నిజమో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే 622 మంది ఆస్పత్రుల పాలయ్యారు. వారిలో 90శాతం మంది దాకా డిశ్చార్జి అయిపోయినప్పటికీ... అసలు తమకు వచ్చిన అనారోగ్య సమస్య ఏంటన్నది బాధితులకు అర్థం కావట్లేదు. 3 నుంచి 5 నిమిషాలు మూర్చ (Fits), నోట్లో నురగ, తలనొప్పి, వికారం, వామ్టింగ్స్, మతిమరపు, వెన్నునొప్పి, టెన్షన్ ఇలా కొన్ని లక్షణాలు కనిపిస్తున్నా... అది ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది అన్నది తేలకపోవడం ఆశ్చర్యమే. ప్రభుత్వం, వైద్య బృందాలు, ప్రముఖ సంస్థల నిపుణులు... రకరకాల పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కచ్చితమైన కారణం తెలియాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాలంటోంది ప్రభుత్వం.
ఇప్పటివరకు వచ్చిన కొన్ని సంస్థల ప్రాథమిక రిపోర్ట్స్... వ్యవసాయానికి భారీగా పురుగుల మందులు వాడటమే ఇందుకు కారణమని అంటున్నాయి. వింత వ్యాధి బారిన పడిన బాధితుల రక్తంలో సీసం, నికెల్ ఉన్నట్టుగా ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. మరికొన్ని సంస్థలు మాత్రం బాధితులు తీసుకున్న ఆహారంలో పురుగుల మందు వంటి రసాయనాల అవశేషాలు ఉన్నట్టుగా ప్రాథమిక పరిశోధన ఫలితాల్లో తెలిపాయి.
తెరపైకి ఏలూరు:
ఇరుకు రోడ్లు, రోడ్ల పక్క నుంచీ వెళ్లే డ్రైనేజీలు, పాత భవనాలు, అధిక జనాభాతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఏలూరు నగరం గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. కొత్తగా కేసులు రాకపోయినా, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో నలుగురు పేషెంట్లు మాత్రమే ఈ వ్యాధితో ఉన్నా... ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన కేసులు దేశ ప్రజల్లో భయం కలిగించాయి. అసలే కరోనాతో టెన్షన్ పడుతుంటే... మళ్లీ ఇదేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం... ఇది వైరస్ కాదంటున్నారు. వైరస్ అయి ఉంటే... ఇంకా ఎక్కువ టెన్షన్ ఉండేది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి ఉండేది. వైరస్ కాకపోవడం వల్ల బాధితుల సంఖ్య ఇక్కడితో ఆగిందనుకోవచ్చు.
Whats happening? @ANI: Number of people falling sick in Eluru is increasing. From last night to this morning around 140 persons were admitted & discharged. Symptoms include nausea & fainting. Reason unkown: #AndhraPradeshpic.twitter.com/7QD9hU1vIF
ఈ వింత వ్యాధిపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (CCMB), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఢిల్లీ ఎయిమ్స్ సహా చాలా సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. సిటీలోని నీటి పారుదల వ్యవస్థను చూస్తే... చాలా చోట్ల కాలువలు మురికి కూపాల్లా కనిపిస్తున్నాయి. కీలకమైన తమ్మిలేరు సహా చాలా కాలువలు... మురికి నీటితో గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. అసలు ఈ నీరు వ్యవసాయానికి ఏమాత్రం పనికిరాదు. తమకు వచ్చే మున్సిపల్ వాటర్ కూడా సరిగా ఉండట్లేదనీ... ఒక్కోసారి బురద రంగులో ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఆ నీటిలో ఆర్గానోక్లోరన్ పురుగు మందు ఉన్నట్లు తేల్చారు.
PHOTO OF THE DAY: Raghuram Rajan, newly appointed governor of RBI, hugs the outgoing governor Duvvuri Subbarao pic.twitter.com/E8ER5XpO5i
గొప్ప చరిత్ర:
వింత వ్యాధితో ఏలూరు పేరు డ్యామేజ్ అయ్యిందనుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్‌గా చేసిన... దువ్వూరి సుబ్బారావు ఏలూరు వారే. 2008లో వైవీ రెడ్డి నుంచి ఈ పదవీ బాధ్యతలు చేపట్టిన సుబ్బారావు... ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో దేశానికి RBI గవర్నర్‌గా చేశారు. 2013లో ఆయన నుంచి ఈ పదవిని రఘురామ్ రాజన్ స్వీకరించారు.
సుబ్బారావు ఏలూరులో తెలుగు మీడియం స్కూల్లో చదివారు. తర్వాత కోరుకొండ సైనిక్ స్కూల్‌కి వెళ్లారు. ఆ తర్వాత 1972లో UPSC ఎగ్జామ్స్‌లో ప్రతిభ చాటి... IAS ఆఫీసర్ అయ్యారు. 2008లో ఆర్బీఐ గవర్నర్‌కి ఫైనాన్స్ సెక్సెటరీగా పనిచేశారు. మరో విషయమేంటంటే... ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న రేవు ముత్యాల రాజు... 2007లో UPSC ఎగ్జామ్స్‌లో దేశంలోనే టాపర్‌గా నిలిచారు.
ఏలూరుకి చాలా గొప్ప చరిత్ర ఉంది. పూర్వం దీన్ని హేలాపురి అని పిలిచేవారు. క్రీస్తు శకం 700 - 1200 మధ్య తూర్పు చాళుక్యులు దీన్ని పరిపాలించారు. ఆ తర్వాత 1471 వరకూ ఇది కళింగుల పాలనలో ఉంది. ఆ తర్వాత గజపతులు, శ్రీ కృష్ణ దేవరాయలు, గోల్కొండ సుల్తానుల మధ్య ఏలూరు చేతులు మారుతూ ఉండేది. 1925లో బ్రిటషర్ల పాలనలో ఇది జిల్లా ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడి నుంచి ఒకప్పుడు తివాచీలు... అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యేవి. అంతటి గొప్ప చరిత్ర ఈ నగరానిది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.