Home /News /andhra-pradesh /

ELURU MYSTERY DISEASE 10 PEOPLE HOSPITALIZED WITH UNKNOWN ILLNESS IN WEST GODAVARI SK

West Godavari: పశ్చిమ గోదావరిలో మళ్లీ వింత వ్యాధి కలకలం.. 10 మందికి అస్వస్థత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

West Godavari: బాధితుల్లో కొందరిలో మూర్ఛలక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. బాధితులు ఉన్నట్టుండి కింద పడిపోతున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భీమడోలు మండల ప్రజల్లో భయాందోళ నెలకొంది.

    గత ఏడాది డిసెంబరులో వింత వ్యాధితో ఏలూరు పట్టణం విలవిల్లాడిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ గోదావరిలో వింత వ్యాధి మళ్లీ కలకలం రేపుతోంది. జిల్లాలోని భీమడోలు మండలం పూళ్లలో.. ఏలూరు తరహాలో పలువురు వింత వ్యాధి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. రెండ్రోజులుగా 10 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో కొందరిలో మూర్ఛలక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. బాధితులు ఉన్నట్టుండి కింద పడిపోతున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భీమడోలు మండల ప్రజల్లో భయాందోళ నెలకొంది. ఏలూరు తరహానే వింత వ్యాధి ఉందని చెబుతున్నారు. ఐతే పుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురి అయి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. రిపోర్టులు వస్తే దీనిపై మరింత క్లారిటీ వస్తుంది.

    గత ఏడాది డిసెంబరు 4 నుంచి 12 మధ్య వారం రోజుల పాటు 622 మంది బాధితులు అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరారు. కస్మికంగా మూర్చపోవడం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో అల్లాడిపోయారు. ఈ వ్యాధితో ఇద్దరు మరణించారు. ఐతే జరిగిందో..ఎందుకు అలా కుప్పకూలుతున్నారో తెలియక ఇటు అధికారులు, అటు వైద్యులు తలలు పట్టుకున్నారు. కానీ చివరకు ఢిల్లీ ఎయిమ్స్ బృందం రంగంలోకి దిగింది. బాధితుల శాంపిల్స్‌తో పాటు ఏలూరులోని నీరు, కూరగాయలను ల్యాబ్‌కు తరలించి పరీక్షలు చేశారు. ఐతే ఏం జరిగిందన్న దానిపై ల్యాబ్‌లు భిన్నాభిప్రాయాలు తెలిపాయి. కొందరు నీటి కాలుష్యమంటే.. మరికొందరు పురుగుల మందుల అవశేషాలు అని చెప్పారు.

    ఐతే ఏపీ ప్రభుత్వం అత్యున్నత స్దాయి నిపుణులతో హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 40 మందికి పైగా అధికారులు, నిపుణులు, డాక్టర్లతో కూడిన కమిటీ.. కొన్ని రోజులుగా ఏలూరులో విస్తృత స్ధాయిలో ఏలూరులో పర్యటించింది. అక్కడ సేకరించిన శాంపిల్స్‌ను ప్రముఖ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించి చివరకు అంతుచిక్కని వ్యాధికి గల కారణాలను తేల్చింది. విషతుల్యంగా మారిన కూరగాయలే వింత వ్యాధికి కారణమని హై పవర్‌ కమిటీ స్పష్టం చేసింది. ఏలూరు మార్కెట్‌లో కూరగాయలను వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కొనుగోలు చేశారని.. ఆయా ప్రాంతాల్లోనే వ్యాధి తీవ్రత కనిపించిందని కమిటీ పేర్కొంది. రైతులు పంటల సాగులో రసాయనాల వాడకం తగ్గించాలని, ఏలూరు కాలువలో రసాయనాలు, ఇతర వ్యర్థాలను విడుదల చేయొద్దని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. వింత వ్యాధి ప్రభావానికి గురైన ప్రాంతాలతో పాటు ఏలూరు నగర వ్యాప్తంగా ప్రభుత్వం సరఫరా చేసే నీటిపై దృష్టి పెట్టాలని కూడా నివేదికలో పేర్కొంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Eluru, West Godavari

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు