Home /News /andhra-pradesh /

Eluru Municipal Corporation Results: ఏలూరు కార్పొరేషన్.. మృతి చెందిన ఇద్దరు అభ్యర్థుల విజయం

Eluru Municipal Corporation Results: ఏలూరు కార్పొరేషన్.. మృతి చెందిన ఇద్దరు అభ్యర్థుల విజయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వారు ఎన్నికల్లో విజయం సాధించడం కోసం జోరుగా ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరిగి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

    వారు ఎన్నికల్లో విజయం సాధించడం కోసం జోరుగా ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరిగి ఓటు వేసి గెలిపించాలని కోరారు. జనాలు కూడా ఓట్లు వేసి వారిని గెలిపించారు. కానీ దురదృష్టం వారిని వెంటాడింది. ఎన్నికల్లో విజయం సాధించిన ఇద్దరు అభ్యర్థులు.. ఫలితాలు వెలువడకముందే మృతిచెందారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక ఎన్నికల్లో చోటుచేసుకుంది. ఏలూరు నగరపాలక సంస్థకు మార్చి 10న ఎన్నికలు జరగగా.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫలితాలు నిలిచిపోయాయి. తాజాగా ఆదివారం రోజున ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ.. భారీ విజయం సాధించింది. మొత్తం 50 డివిజన్లకు గానూ.. మూడు చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 47 స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో 44 చోట్ల వైసీపీ విజయం సాధించింది. మూడు చోట్ల టీడీపీ విజయం సాధించింది.

    అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచి విజయం సాధించిన ఇద్దరు అభ్యర్థులు.. ఫలితాలు రాకముందే కరోనా బారినపడి మృతిచెందారు. వైసీపీ తరఫున 45వ డివిజన్‌ నుంచి బేతపూడి ప్రతాపచంద్ర, 46వ డివిజన్‌ నుంచి ప్యారీ బేగం ఎన్నికల బరిలో నిలిచారు. అయితే రెండు నెలల క్రితమే వీరు కోవిడ్‌తో మరణించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో వీరిద్దరు విజయం సాధించారు. ప్రతాపచంద్ర ముఖర్జీ 1,058, ప్యారీ బేగం 1,232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

    ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల గురించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్‌ తెలిపారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Andhra Pradesh, Eluru, West Godavari, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు