హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Eluru Fire Accident: ఏలూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు.. ఆరుగురు సజీవదహనం

Eluru Fire Accident: ఏలూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు.. ఆరుగురు సజీవదహనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Eluru Fire Accident: యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు వాపోతున్నారు. చక్కెర కార్మాగారాన్ని రసాయన పరిశ్రమగా మార్చారని ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా తమను పట్టించుకోలేదని.. కనీసం అంబులెన్స్‌కు కూడా కాల్ చేయలేదని చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

ఏలూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం (Eluru Fire Accident) జరిగింది. ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పోరస్ ఫ్యాక్టరీలోని యూనిట్-4లో ఔషధ తయారీలో వాడే పౌడర్ చేస్తుండగా.. రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా గ్యాస్ (Gas Leakage) లీకయింది. అనంతరం రియాక్టర్ పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. మరికొందరు లోపలే చిక్కుకుపోయారు. రెండు ఫ్లోర్లు పూర్తిగా కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు.. దట్టమైన పొగలు అలుముకోవడంతో.. అక్కడున్న వారికి ఊపిరాడలేదు. ప్రమాద సమయంలో మొత్తం 150 మంది డ్యూటీలో ఉన్నట్ల్లు సమాచారం. ఐతే ప్రమాదం జరిగిన యూనిట్‌లో 30 మంది కార్మికులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Cheetah Tension: ఆ గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తన్న చిరుత? అక్కడకు వెళ్తే అంతే

ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. బాధితులను మొదట నూజివీడు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విజయవాడ (Vijayawada)కు తీసుకెళ్లారు. మృతుల్లో నలుగురు బీహార్ కార్మికులు చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. జిల్లా ఎస్పీ కూడా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొన్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు వాపోతున్నారు. చక్కెర కార్మాగారాన్ని రసాయన పరిశ్రమగా మార్చారని ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా తమను పట్టించుకోలేదని.. కనీసం అంబులెన్స్‌కు కూడా కాల్ చేయలేదని చెబుతున్నారు. బాధితులకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తామని చెప్పి.. ప్రభుత్వాస్పత్రికి తరలించారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


AP Cabinet: సీఎం జగన్ కేబినెట్ కూర్పు వెనుక బ్రదర్ అనిల్.. ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బీసీ

ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరిద్దరు మినహా మిగతా వారి పరిస్థితి విషమంగా ఉందని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. 12 మందికి 70శాతానికి పైగా శరీరం కాలిపోయిందని వెల్లడించారు. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు అగ్నిప్రమాదానికి కారణమేంటి? గ్యాస్ ఎందుకు లీకయింది? మానవతప్పిదమా? లేదంటే సాంకేతిక సమస్యా? అని ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో నలుగురు బీహార్ వాసులు ఉండడంతో వారి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Eluru, Fire Accident