ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా గజరాజులు హల్ చల్ చేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం హోసూరు, సూల్ గిరి లోతట్టు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల మందను చూసి స్థానికులు గజగజ వణుకుతున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతం అయినటువంటి మోట్ల చేను, గుడ్ల నాయన పల్లి, సోడి గాని పల్లి, గంగాపురం ,యమసనపల్లి ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఆచుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన టమోట, క్యాబేజీ, మొక్కజొన్న, వరి, బొప్పాయి, బీన్స్, అరటి పంట పొలాలపై అర్ధరాత్రి వేళలో గజరాజు గుంపుల గుంపులుగా చొరబడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల గుంపు వల్ల పంట మొత్తం నష్టపోతున్నామంటూ అటవీ సరిహద్దు గ్రామాల రైతులు ప్రజలు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర, తమిళనాడు ఎలిఫెంట్ ట్రాకర్స్ రంగంలోకి దిగారు. రామకుప్పం, శాంతిపురం, గూడపల్లి, కుప్పం నాలుగు మండలాల పరిధిలో సుమారుగా 30 గ్రామాలు ఈ అటవీ ప్రాంతలును అనుకోని ఉన్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:June 06, 2020, 17:03 IST