Home /News /andhra-pradesh /

ELECTRICITY CHARGES MAY HIKE IN ANDHRA PRADESH AS POWER SUPPLY FIRMS PROPOSED NEW CHARGES FULL DETAILS HERE PRN

AP Electricity Charges Hike: ఏపీలో పెరగనున్న విద్యుత్ బిల్లులు..? కొత్త ఛార్జీలు ఇవేనా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలపై మరో భారం పడనుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల (Electricity Charges) పెంపునకు డిస్కమ్ లు ప్రబుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలపై మరో భారం పడనుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల (Electricity Charges) పెంపునకు డిస్కమ్ లు ప్రబుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. ప్రస్తుతం ఛార్జీలకు సంబంధించి మొత్తం 13 శ్లాబులుండా వాటిని ఆరుకు కుదించి ఛార్జీలు (Power bill) పెంచాలని భావిస్తున్నాయి. ఈ పంపు తర్వాత పేద మధ్య తరగతి కుటుంబాలపై అదనపు భారం పడనుంది. మధ్యతరగతి వారున్న శ్లాబుల్లో యూనిట్ కు 20 పైసల నుంచి రూ.1.40 వరకు భారం పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ఛార్జీలపై రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. ఐతే పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి కాకుండా ఆగస్ట్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది.

    ప్రస్తుత పరిస్థితుల్లో డిస్కంలు చేసిన ప్రతిపాదనలు ఏపీఈఆర్సీ పరిగణలోకి తీసుకునే అవకాశముంది. ఐతే ఏప్రిల్ నుంచి నాలుగు నెలల పాటు అంటే జూలై వరకు పాత టారిఫ్ ప్రకారమే ఛార్జీలు వసూలు చేయనున్నారు. శ్లాబుల విషయానికి వస్తే ఏ కేటగిరీలో రెండు, బీ కేటగిరీలో నాలుగు, సీ కేటగిరీలో ఏడు శ్లాబుల్లో ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ఏడాది ఆగస్ట్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు శ్లాబులను తగ్గించి.. ఫుల్ కాస్ట్ టారిఫ్ ప్రకారం విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తారు. కొత్త శ్లాబుల్లో డొమెస్టిక్ కనెక్షన్స్ అంటే గృహవినియోగదారులను ఏ, బీ కేటగిరీల్లో ఉంచుతారు. 75 యూనిట్ల లోపు వినియోగించే వారిని ఏ కేటగిరీలో, అంతకుమించి వినియోగించేవారిని బి కేటగిరీలో ఉంచుతారు.

    ఇది చదవండి: జగన్ కేబినెట్లో ఐదుగురు మహిళలకు ఛాన్స్..? రేసులో ఎవరున్నారంటే..!


    ప్రస్తుతం అమల్లో ఉన్న కేటరిగీలు, టారిఫ్ లను పరిశీలిస్తూ ఏ గేటగిరీలో 0-50 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కి రూ.1.45 ఛార్జ్ చేస్తున్నారు. ఏ కేటగిరీలోనే 51-75 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.2.60 వసూలు చేస్తున్నారు. అలాగే బీ కేటగిరీలో 0-50, 51-1400 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.2.60 వసూలు చేస్తున్నారు. బీ కేటగిరీలో 101-200 యూనిట్లు వినియోగించేవారికి యూనిట్ కు రూ.3.60, 201-225 యూనిట్లు వినియోగించేవారికి యూనిట్ కు రూ.6.90 వసూలు చేస్తున్నారు. ఇక సీ కేటగిరీలో 0-50 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.2.65, 51-100 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.3.35, 101-200 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.5.40, 201-300 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.7.10, 301-400 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.7.95, 401-500 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.8.50, 500 యూనిట్లకు మించి వినియోగిస్తే యూనిట్ క రూ.9.95 వసూలు చేస్తున్నారు.

    ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ బడ్జెట్ తో ఏపీలో ఈ పథకాలు అమలు చేయవచ్చు.. అవేంటంటే..!


    కొత్తగా ప్రతిపాదించిన ఛార్జీల ప్రకారం ఏ కేటగిరీలో 0-30 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.1.45, 31-75 యూనిట్ల వరకు వినియోగిస్తే యూనిట్ కు రూ.2.80, బీ కేటగిరీలో 0-100 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.4, ఇదే కేటగిరీలో 101-200 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కి రూ.5, 201-300 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు రూ.7, 300 యూనిట్లకు మించితే యూనిట్ కు రూ.7.50 వసూలు చేస్తారు.

    ఇది చదవండి: సీఆర్డీఏకి అమరావతి రైతుల షాక్.. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు అభ్యంతరం.. కారణం ఇదే..!


    డిస్కమ్ ల ప్రతిపాదనలు ఏపీఈఆర్సీ ఆమోదిస్తే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి కానీ ట్రూ అఫ్ ఛార్జీలు పెంచాల్సి ఉన్నందున ప్రజలపై భారం పెరుగుతుందని వాయిదా వేశారు. ఐతే ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలను కూడా పెంచలేదు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో పాటు వంటనూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో ప్రజల నెత్తిన విద్యుత్ ఛార్జీల భారం కూడా పడనుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Power tariff

    తదుపరి వార్తలు