1.పోలింగ్ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?
2.నూటికి 80 శాతం ఈవీఎంలు ఎందుకు పనిచెయ్యలేదు?
3.పోలింగ్ ప్రక్రియను రాత్రిలోపు ముగించకుండా... మర్నాడు మధ్యాహ్నం వరకూ ఎందుకు కొనసాగించారు?
4.పోలీసులు ఎందుకు సరిపోలేదు?
5.ఈవీఎంలో 12వ బటన్ నొక్కితే, 2వ బటన్‌కు ఓటుపడుతూ... వీవీప్యాట్ స్లిప్పు 3 సెకండ్లు మాత్రమే ఎందుకు పడుతోంది?
6.ఓటర్ల నుంచీ కంప్లైంట్లను లిఖిత పూర్వకంగా ఎందుకు తీసుకోలేదు?
7.పోలింగ్ అబ్జర్వర్లుగా దక్షిణాది వారిని కాకుండా ఉత్తరాది వారిని ఎందుకు నియమించారు?
ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచీ లిఖిత పూర్వకంగా సమాధానం కావాలన్నారు కేఏ పాల్. ఢిల్లీ వెళ్లిన ఆయన... జాతీయ పార్టీల నేతలను కలుస్తూ బీజేపీకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు. గురువారం లేదా శుక్రవారం సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ఆయన... మూడో దశ నుంచీ ఎన్నికల్ని రద్దు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
తమకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేడీఎస్ తదితర పార్టీల మద్దతు ఉందన్నారు. ఎన్నికలు రద్దు అయ్యేలా ప్రజలంతా పోరాడాలని కోరారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.