లోకేష్ నామినేషన్‌ పత్రాల్లో తప్పులు... పక్కన పెట్టేస్తారా? మంగళగిరిలో పోటీ లేనట్లేనా?

AP Assembly Elections : ఇప్పటికే కే ఏ పాల్ నామినేషన్ చెల్లదని ప్రకటించిన ఎన్నికల అధికారులు... నారా లోకేష్ నామినేషన్‌పై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 5:43 PM IST
లోకేష్ నామినేషన్‌ పత్రాల్లో తప్పులు... పక్కన పెట్టేస్తారా? మంగళగిరిలో పోటీ లేనట్లేనా?
నారా లోకేష్ (File)
  • Share this:
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తప్పులు ఉన్నట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. దానిని ఆమోదించకుండా అలాగని తిరస్కరించకుండా... నిర్ణయాన్ని బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ప్రధానంగా ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల్నీ నోటరి చేసిన వ్యక్తి కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తున్నారు. ఐతే...లోకేష్ తాను గుంటూరు జిల్లాలో ఉంటున్నట్లు నామినేషన్ పత్రాల్లో తెలిపారు. నోటరీ రూల్స్ ప్రకారం ఈ నామినేషన్ చెల్లదన్న వాదన వినిపిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారి... లోకేష్‌ను కోరారు. అందుకు కొంత సమయ ఇస్తూ... తమ నిర్ణయాన్ని వాయిదా వేశారు.

ఇప్పటికే ఈ అంశంపై ప్రతిపక్ష వైసీపీ సీరియస్‌గా ఉంది. తప్పుడు నామినేషన్ పత్రాలు ఇచ్చినందుకు చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. లోకేష్ గుంటూరు జిల్లా పరిధిలో నివసిస్తదూ... కృష్ణా జిల్లా నోటరీ చేత నోటరీ ఎందుకు చేయించారని అభ్యంతరం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఎన్నికల అధికారులు పక్షపాత రహితంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ లోకేష్ ఇచ్చిన వివరణతో ఎన్నికల అధికారి సంతృప్తి చెందకపోతే... నామినేషన్‌ను తిరస్కరించే పరిస్థితి ఉంటుంది. ఐతే... ఇది పొరపాటే తప్ప... తప్పిదం కాదంటున్న టీడీపీ నేతలు... అంత మాత్రాన నామినేషన్ తిరస్కరించే పరిస్థితి ఉండదంటున్నారు.

 

ఇవి కూడా చదవండి :కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు... పవన్, చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ఫైర్

ఇది పేదరికంపై సర్జికల్ స్ట్రైక్... కనీస ఆదాయ పథకంపై రాహుల్ స్వీట్ కామెంట్

30,000 ప్రపంచ మ్యాపుల్ని ధ్వంసం చేసిన చైనా.... అరుణాచల్ ప్రదేశ్, తైవాన్ చైనాలో లేకపోవడమే కారణంస్లీపింగ్ సిండ్రోమ్... కంటిన్యూగా 3 వారాలు నిద్రపోయింది... ఎగ్జామ్స్‌ మిస్సైంది...
First published: March 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు