ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్... మూడు జిల్లాల్లో జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు

AP Assembly Election 2019 : ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకూ, 25 లోక్ సభ స్థానాలకూ ఎన్నికలు జరగితే... ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

Krishna Kumar N | news18-telugu
Updated: April 17, 2019, 5:33 AM IST
ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్... మూడు జిల్లాల్లో జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం... కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. గుంటూరులో 2, నెల్లూరులో 2, ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరింది. ఇందుకు అంగీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం... రీ-పోలింగ్ ఎప్పుడు నిర్వహించేదీ అధికారికంగా ప్రకటన చెయ్యనుంది. ఈ ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన స్క్రూటినీ రిపోర్టులను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించింది. ఈ పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలకు తోడు... ఈవీఎంల మొరాయింపు ఇతర సాంకేతిక సమస్యలు ఎక్కువగా తలెత్తాయని కలెక్టర్లు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. వాటి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ... కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు.

శాంతి భద్రతల సమస్య తలెత్తిన ఈ ఐదు కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును సరిగా వినియోగించుకోలేకపోయారని జిల్లాల కలెక్టర్లు స్క్రూటినీ రిపోర్టుల్లో తెలిపారు. అందువల్ల మరోసారి ఎన్నికలు జరిపేందుకు ఈసీ సిద్ధపడింది.

నెల్లూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఎన్నికల నిర్వహణలో జరిగిన ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనలపై ఇప్పటికే FIR నమోదు చేసినట్లు తెలిపిన ద్వివేదీ... బాధ్యులైన అధికారులపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ల విషయంలో ఓ రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. వాళ్లిద్దరూ ఘటన జరిగిన తర్వాత ఆధారాలు లభించకుండా చేసేందుకు వీవీప్యాట్ స్లిప్పులను తగలబెట్టేందుకు యత్నించారని ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ పరిశీలించితే, రెండు కవర్లు, స్లిప్పులు తగ్గినట్లు తేలిందన్నారు.


ప్రస్తుతం ఈసీ తాజా ఆదేశాల ప్రకారం స్ట్రాంగ్ రూంలలో ఉండే ఈవీఎంలను ఏమాత్రం కదపడానికి వీల్లేదు. విధుల్లో చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తప్పవు. ఐతే, మరిన్ని ప్రాంతాల్లో కూడా రీపోలింగ్ జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఐదు చోట్లే రీపోలింగ్ నిర్వహిస్తుందో, సంఖ్య మరింత పెంచుతుందో త్వరలో తెలుస్తుంది.ఇవి కూడా చదవండి :

విజయసాయిరెడ్డికి బెదిరింపు కాల్స్... ఎవరు చేస్తున్నారంటే...

పుదుచ్చేరిలో ఈసారి గెలిచేదెవరు... పుదుచ్చేరి లోక్ సభ స్థానం ఎందుకు ప్రత్యేకమైనది...ముస్లింలంతా కాంగ్రెస్‌కి ఓటు వేయాలి... సిద్ధూ వ్యాఖ్యలపై చర్యలకు బీజేపీ డిమాండ్...

దయచేసి అలాంటి వార్తలు ఇవ్వొద్దు... మీడియాకు తెలంగాణ సీఈసీ రజత్ కుమార్ వినతి
Published by: Krishna Kumar N
First published: April 17, 2019, 5:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading